జెకర్యా 9:2 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ జెకర్యా జెకర్యా 9 జెకర్యా 9:2

Zechariah 9:2
​ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.

Zechariah 9:1Zechariah 9Zechariah 9:3

Zechariah 9:2 in Other Translations

King James Version (KJV)
And Hamath also shall border thereby; Tyrus, and Zidon, though it be very wise.

American Standard Version (ASV)
and Hamath, also, which bordereth thereon; Tyre and Sidon, because they are very wise.

Bible in Basic English (BBE)
As well as Hamath, which is by its limit, and Tyre and Zidon, because they are very wise.

Darby English Bible (DBY)
and also [on] Hamath [which] bordereth thereon; on Tyre and Zidon, though she be very wise.

World English Bible (WEB)
And Hamath, also, which borders on it; Tyre and Sidon, because they are very wise.

Young's Literal Translation (YLT)
And also Hamath doth border thereon, Tyre and Zidon, for -- very wise!

And
Hamath
וְגַםwĕgamveh-ɡAHM
also
חֲמָ֖תḥămāthuh-MAHT
shall
border
תִּגְבָּלtigbālteeɡ-BAHL
thereby;
Tyrus,
בָּ֑הּbāhba
Zidon,
and
צֹ֣רṣōrtsore
though
וְצִיד֔וֹןwĕṣîdônveh-tsee-DONE
it
be
very
כִּ֥יkee
wise.
חָֽכְמָ֖הḥākĕmâha-heh-MA
מְאֹֽד׃mĕʾōdmeh-ODE

Cross Reference

యెహెజ్కేలు 28:12
నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాపూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

యిర్మీయా 49:23
దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.

యెహెజ్కేలు 28:2
నరపుత్రుడా, తూరు అధి పతితో ఈలాగు ప్రకటింపుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగాగర్విష్ఠుడవైనే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు,ఒ నీకు మర్మమైనదేదియు లేదు.

ఓబద్యా 1:20
మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెర పట్టబడినవారు సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణ ములను స్వతంత్రించుకొందురు.

ఆమోసు 6:14
ఇందుకు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు.

ఆమోసు 1:9
యెహోవా సెలవిచ్చునదేమనగాతూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహో దర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.

యోవేలు 3:4
తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా?

యెహెజ్కేలు 28:21
నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమువైపు త్రిప్పుకొని దానిగూర్చి యీ సమాచారము ప్రవచింపుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

యెహెజ్కేలు 26:1
మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యెషయా గ్రంథము 23:1
తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.

రాజులు రెండవ గ్రంథము 25:21
బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడిరి.

రాజులు రెండవ గ్రంథము 23:33
ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి

రాజులు మొదటి గ్రంథము 17:9
​నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.

సంఖ్యాకాండము 13:21
​కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.