Bible

Psalm 101 - WEB (Telugu)

1 > I will sing of loving kindness and justice. To you, Yahweh, I will sing praises.నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.

2 I will be careful to live a blameless life. When will you come to me? I will walk within my house with a blameless heart.నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొం దును

3 I will set no vile thing before my eyes. I hate the deeds of faithless men. They will not cling to me.నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను

4 A perverse heart will be far from me. I will have nothing to do with evil.మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను.

5 I will silence whoever secretly slanders his neighbor. I won't tolerate one who is haughty and conceited.తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను

6 My eyes will be on the faithful of the land, That they may dwell with me. He who walks in a perfect way, He will serve me.నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు.

7 He who practices deceit won't dwell within my house. He who speaks falsehood won't be established before my eyes.మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

8 Morning by morning, I will destroy all the wicked of the land; To cut off all the workers of iniquity from Yahweh's city.యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.

Telugu Bible