Bible

Proverbs 24 - WEB (Telugu)

1 Don't be envious of evil men; Neither desire to be with them:దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము

2 For their hearts plot violence, And their lips talk about mischief.వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.

3 Through wisdom a house is built; By understanding it is established;జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.

4 By knowledge the rooms are filled With all rare and beautiful treasure.తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.

5 A wise man has great power; And a knowledgeable man increases strength;జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.

6 For by wise guidance you wage your war; And victory is in many advisors.వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము

7 Wisdom is too high for a fool: He doesn't open his mouth in the gate.​మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.

8 One who plots to do evil Will be called a schemer.​కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.

9 The schemes of folly are sin. The mocker is detested by men.​మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.

10 If you falter in the time of trouble, Your strength is small.శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

11 Rescue those who are being led away to death! Indeed, hold back those who are staggering to the slaughter!చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?

12 If you say, "Behold, we didn't know this;" Doesn't he who weighs the hearts consider it? He who keeps your soul, doesn't he know it? Shall he not render to every man according to his work?ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.

13 My son, eat honey, for it is good; The droppings of the honeycomb, which are sweet to your taste:నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.

14 So you shall know wisdom to be to your soul; If you have found it, then there will be a reward, Your hope will not be cut off.నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.

15 Don't lay in wait, wicked man, against the habitation of the righteous. Don't destroy his resting-place:భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.

16 For a righteous man falls seven times, and rises up again; But the wicked are overthrown by calamity.నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.

17 Don't rejoice when your enemy falls. Don't let your heart be glad when he is overthrown;నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.

18 Lest Yahweh see it, and it displease him, And he turn away his wrath from him.యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.

19 Don't fret yourself because of evildoers; Neither be envious of the wicked:దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.

20 For there will be no reward to the evil man; And the lamp of the wicked shall be snuffed out.దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరి పోవును

21 My son, fear Yahweh and the king. Don't join those who are rebellious:నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.

22 For their calamity will rise suddenly; The destruction from them both--who knows?అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?

23 These also are sayings of the wise. To show partiality in judgment is not good.ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు

24 He who says to the wicked, "You are righteous;" Peoples shall curse him, and nations shall abhor him--నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.

25 But it will go well with those who convict the guilty, And a rich blessing will come on them.న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

26 An honest answer Is like a kiss on the lips.సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.

27 Prepare your work outside, And get your fields ready. Afterwards, build your house.బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.

28 Don't be a witness against your neighbor without cause. Don't deceive with your lips.నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?

29 Don't say, "I will do to him as he has done to me; I will render to the man according to his work."వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము.

30 I went by the field of the sluggard, By the vineyard of the man void of understanding;సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా

31 Behold, it was all grown over with thorns. Its surface was covered with nettles, And its stone wall was broken down.ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను.దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.

32 Then I saw, and considered well. I saw, and received instruction:నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.

33 A little sleep, a little slumber, A little folding of the hands to sleep;ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట

34 So shall your poverty come as a robber, And your want as an armed man.వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

Telugu Bible