Proverbs 11 - ASV (Telugu)
1 A false balance is an abomination to Jehovah; But a just weight is his delight.దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
2 When pride cometh, then cometh shame; But with the lowly is wisdom.అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
3 The integrity of the upright shall guide them; But the perverseness of the treacherous shall destroy them.యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.
4 Riches profit not in the day of wrath; But righteousness delivereth from death.ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.
5 The righteousness of the perfect shall direct his way; But the wicked shall fall by his own wickedness.యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
6 The righteousness of the upright shall deliver them; But the treacherous shall be taken in their own iniquity.యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.
7 When a wicked man dieth, `his' expectation shall perish; And the hope of iniquity perisheth.భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.
8 The righteous is delivered out of trouble, And the wicked cometh in his stead.నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును
9 With his mouth the godless man destroyeth his neighbor; But through knowledge shall the righteous be delivered.భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
10 When it goeth well with the righteous, the city rejoiceth; And when the wicked perish, there is shouting.నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
11 By the blessing of the upright the city is exalted; But it is overthrown by the mouth of the wicked.యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.
12 He that despiseth his neighbor is void of wisdom; But a man of understanding holdeth his peace.తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
13 He that goeth about as a tale-bearer revealeth secrets; But he that is of a faithful spirit concealeth a matter.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.
14 Where no wise guidance is, the people falleth; But in the multitude of counsellors there is safety.నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
15 He that is surety for a stranger shall smart for it; But he that hateth suretyship is secure.ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
16 A gracious woman obtaineth honor; And violent men obtain riches.నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.
17 The merciful man doeth good to his own soul; But he that is cruel troubleth his own flesh.దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును
18 The wicked earneth deceitful wages; But he that soweth righteousness `hath' a sure reward.భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
19 He that is stedfast in righteousness `shall attain' unto life; And he that pursueth evil `doeth it' to his own death.యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును
20 They that are perverse in heart are an abomination to Jehovah; But such as are perfect in `their' way are his delight.మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.
21 `Though' hand `join' in hand, the evil man shall not be unpunished; But the seed of the righteous shall be delivered.నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.
22 `As' a ring of gold in a swine's snout, `So is' a fair woman that is without discretion.వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.
23 The desire of the righteous is only good; `But' the expectation of the wicked is wrath.నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.
24 There is that scattereth, and increaseth yet more; And there is that withholdeth more than is meet, but `it tendeth' only to want.వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
25 The liberal soul shall be made fat; And he that watereth shall be watered also himself.ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును
26 He that withholdeth grain, the people shall curse him; But blessing shall be upon the head of him that selleth it.ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.
27 He that diligently seeketh good seeketh favor; But he that searcheth after evil, it shall come unto him.మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.
28 He that trusteth in his riches shall fall; But the righteous shall flourish as the green leaf.ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
29 He that troubleth his own house shall inherit the wind; And the foolish shall be servant to the wise of heart.తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.
30 The fruit of the righteous is a tree of life; And he that is wise winneth souls.నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు
31 Behold, the righteous shall be recompensed in the earth: How much more the wicked and the sinner!నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?
Telugu Bible