Job 39 - WEB (Telugu)
1 "Do you know the time when the mountain goats give birth? Do you watch when the doe bears fawns?అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
2 Can you number the months that they fulfill? Or do you know the time when they give birth?అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
3 They bow themselves, they bring forth their young, They end their labor pains.అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
4 Their young ones become strong. They grow up in the open field. They go forth, and don't return again.వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
5 "Who has set the wild donkey free? Or who has loosened the bonds of the swift donkey,అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
6 Whose home I have made the wilderness, And the salt land his dwelling-place?నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
7 He scorns the tumult of the city, Neither hears he the shouting of the driver.పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
8 The range of the mountains is his pasture, He searches after every green thing.పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
9 "Will the wild ox be content to serve you? Or will he stay by your feeding trough?గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
10 Can you hold the wild ox in the furrow with his harness? Or will he till the valleys after you?పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
11 Will you trust him, because his strength is great? Or will you leave to him your labor?దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
12 Will you confide in him, that he will bring home your seed, And gather the grain of your threshing floor?అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
13 "The wings of the ostrich wave proudly; But are they the feathers and plumage of love?నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
14 For she leaves her eggs on the earth, Warms them in the dust,లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
15 And forgets that the foot may crush them, Or that the wild animal may trample them.దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
16 She deals harshly with her young ones, as if they were not hers. Though her labor is in vain, she is without fear,తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
17 Because God has deprived her of wisdom, Neither has he imparted to her understanding.దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
18 When she lifts up herself on high, She scorns the horse and his rider.అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
19 "Have you given the horse might? Have you clothed his neck with a quivering mane?గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
20 Have you made him to leap as a locust? The glory of his snorting is awesome.మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
21 He paws in the valley, and rejoices in his strength: He goes out to meet the armed men.మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.
22 He mocks at fear, and is not dismayed; Neither does he turn back from the sword.అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
23 The quiver rattles against him, The flashing spear and the javelin.అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు
24 He eats up the ground with fierceness and rage, Neither does he stand still at the sound of the trumpet.ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.
25 As often as the trumpet sounds he snorts, 'Aha!' He smells the battle afar off, The thunder of the captains, and the shouting.బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
26 "Is it by your wisdom that the hawk soars, And stretches her wings toward the south?డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
27 Is it at your command that the eagle mounts up, And makes his nest on high?పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
28 On the cliff he dwells, and makes his home, On the point of the cliff, and the stronghold.అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
29 From there he spies out the prey. His eyes see it afar off.అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
30 His young ones also suck up blood. Where the slain are, there he is."దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.
Telugu Bible