Isaiah 32 - WEB (Telugu)
1 Behold, a king shall reign in righteousness, and princes shall rule in justice.ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
2 A man shall be as a hiding-place from the wind, and a covert from the tempest, as streams of water in a dry place, as the shade of a great rock in a weary land.మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
3 The eyes of those who see shall not be dim, and the ears of those who hear shall listen.చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.
4 The heart of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
5 The fool shall be no more called noble, nor the scoundrel be highly respected.మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.
6 For the fool will speak folly, and his heart will work iniquity, to practice profanity, and to utter error against Yahweh, to make empty the soul of the hungry, and to cause the drink of the thirsty to fail.మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.
7 The instruments of the churl are evil: he devises wicked devices to destroy the humble with lying words, even when the needy speaks right.మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
8 But the noble devises noble things; and in noble things shall he continue.ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
9 Rise up, you women who are at ease, [and] hear my voice; you careless daughters, give ear to my speech.సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
10 For days beyond a year shall you be troubled, you careless women; for the vintage shall fail, the harvest shall not come.నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
11 Tremble, you women who are at ease; be troubled, you careless ones; strip yourselves, and make yourselves naked, and gird [sackcloth] on your loins.సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.
12 They shall strike on the breasts for the pleasant fields, for the fruitful vine.రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.
13 On the land of my people shall come up thorns and briers; yes, on all the houses of joy in the joyous city.నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు
14 For the palace shall be forsaken; the populous city shall be deserted; the hill and the watch-tower shall be for dens forever, a joy of wild donkeys, a pasture of flocks;నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ లుగా ఉండును
15 until the Spirit be poured on us from on high, and the wilderness become a fruitful field, and the fruitful field be esteemed as a forest.అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.
16 Then justice shall dwell in the wilderness; and righteousness shall abide in the fruitful field.అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును
17 The work of righteousness shall be peace; and the effect of righteousness, quietness and confidence forever.నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
18 My people shall abide in a peaceable habitation, and in safe dwellings, and in quiet resting-places.అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును
19 But it shall hail in the downfall of the forest; and the city shall be utterly laid low.పట్టణము నిశ్చయముగా కూలిపోవును.
20 Blessed are you who sow beside all waters, who send forth the feet of the ox and the donkey.సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
Telugu Bible