Bible

Genesis 40 - BBE (Telugu)

1 Now after these things the chief servant who had the care of the wine, and the chief bread-maker in Pharaoh's house, did something against Pharaoh's orders;అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి

2 And Pharaoh was angry with his two servants, with the chief wine-servant and the chief bread-maker;గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి

3 And he put them in prison under the care of the captain of the army, in the same prison where Joseph himself was shut up.వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.

4 And the captain put them in Joseph's care, and he did what was needed for them; and they were kept in prison for some time.ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలో నుండినతరువాత

5 And these two had a dream on the same night; the chief wine-servant and the chief bread-maker of the king of Egypt, who were in prison, the two of them had dreams with a special sense.వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను.

6 And in the morning when Joseph came to them he saw that they were looking sad.తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి.

7 And he said to the servants of Pharaoh who were in prison with him, Why are you looking so sad?అతడుఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.

8 Then they said to him, We have had a dream, and no one is able to give us the sense. And Joseph said, Does not the sense of dreams come from God? what was your dream?అందుకు వారుమేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచిభావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు

9 Then the chief wine-servant gave Joseph an account of his dream, and said, In my dream I saw a vine before me;అప్పుడు పానదాయకుల అధిపతి యోసే పును చూచినా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;

10 And on the vine were three branches; and it seemed as if it put out buds and flowers, and from them came grapes ready for cutting.ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.

11 And Pharaoh's cup was in my hand, and I took the grapes and crushing them into Pharaoh's cup, gave the cup into Pharaoh's hand.మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.

12 Then Joseph said, This is the sense of your dream: the three branches are three days;అప్పుడు యోసేపుదాని భావ మిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;

13 After three days Pharaoh will give you honour, and put you back into your place, and you will give him his cup as you did before, when you were his wine-servant.ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పాన దాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు

14 But keep me in mind when things go well for you, and be good to me and say a good word for me to Pharaoh and get me out of this prison:కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరు ణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.

15 For truly I was taken by force from the land of the Hebrews; and I have done nothing for which I might be put in prison.ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చ యము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

16 Now when the chief bread-maker saw that the first dream had a good sense, he said to Joseph, I had a dream; and in my dream there were three baskets of white bread on my head;అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెనునేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.

17 And in the top basket were all sorts of cooked meats for Pharaoh; and the birds were taking them out of the baskets on my head.మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధము లైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను.

18 Then Joseph said, This is the sense of your dream: the three baskets are three days;అందుకు యోసేపుదాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు

19 After three days Pharaoh will take you out of prison, hanging you on a tree, so that your flesh will be food for birds.ఇంక మూడు దినముల లోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.

20 Now the third day was Pharaoh's birthday, and he gave a feast for all his servants; and he gave honour to the chief wine-servant and the chief bread-maker among the others.మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి

21 And he put the chief wine-servant back in his old place; and he gave the cup into Pharaoh's hand.పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.

22 But the chief bread-maker was put to death by hanging, as Joseph had said.మరియు యోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.

23 But the wine-servant did not keep Joseph in mind or give a thought to him.అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

Telugu Bible