దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:7 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:7

1 Chronicles 22:7
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా

1 Chronicles 22:61 Chronicles 221 Chronicles 22:8

1 Chronicles 22:7 in Other Translations

King James Version (KJV)
And David said to Solomon, My son, as for me, it was in my mind to build an house unto the name of the LORD my God:

American Standard Version (ASV)
And David said to Solomon his son, As for me, it was in my heart to build a house unto the name of Jehovah my God.

Bible in Basic English (BBE)
And David said to Solomon, My son, it was my desire to put up a house for the name of the Lord my God.

Darby English Bible (DBY)
And David said to Solomon, As for me, my son, I was minded to build a house unto the name of Jehovah my God.

Webster's Bible (WBT)
And David said to Solomon, My son, as for me, it was in my mind to build a house to the name of the LORD my God:

World English Bible (WEB)
David said to Solomon his son, As for me, it was in my heart to build a house to the name of Yahweh my God.

Young's Literal Translation (YLT)
and David saith to Solomon his son, `As for me, it hath been with my heart to build a house to the name of Jehovah my God,

And
David
וַיֹּ֥אמֶרwayyōʾmerva-YOH-mer
said
דָּוִ֖ידdāwîdda-VEED
to
Solomon,
לִשְׁלֹמֹ֑הlišlōmōleesh-loh-MOH
My
son,
בְּנִ֕וbĕniwbeh-NEEV
me,
for
as
אֲנִי֙ʾăniyuh-NEE
it
was
הָיָ֣הhāyâha-YA
in
עִםʿimeem
mind
my
לְבָבִ֔יlĕbābîleh-va-VEE
to
build
לִבְנ֣וֹתlibnôtleev-NOTE
an
house
בַּ֔יִתbayitBA-yeet
name
the
unto
לְשֵׁ֖םlĕšēmleh-SHAME
of
the
Lord
יְהוָ֥הyĕhwâyeh-VA
my
God:
אֱלֹהָֽי׃ʾĕlōhāyay-loh-HAI

Cross Reference

కీర్తనల గ్రంథము 132:5
నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.

ద్వితీయోపదేశకాండమ 12:11
నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవు డైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.

ద్వితీయోపదేశకాండమ 12:5
మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను.

ఎజ్రా 6:12
ఏ రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 6:7
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 2:4
​నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినములయందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:3
మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:2
అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెనునా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:1
దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించినేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా

రాజులు మొదటి గ్రంథము 9:3
అతనితో ఈలాగు సెలవిచ్చెనునా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.

రాజులు మొదటి గ్రంథము 8:29
నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లునా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.

రాజులు మొదటి గ్రంథము 8:16
నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములో నైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెల విచ్చెను.

సమూయేలు రెండవ గ్రంథము 7:2
నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా

ద్వితీయోపదేశకాండమ 12:21
నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూర ముగా ఉండిన యెడల