Romans 4 - WEB (Telugu)
1 What then will we say that Abraham, our forefather, has found according to the flesh?కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.
2 For if Abraham was justified by works, he has something to boast about, but not toward God.అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.
3 For what does the Scripture say? "Abraham believed God, and it was accounted to him for righteousness."లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను
4 Now to him who works, the reward is not counted as grace, but as debt.పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.
5 But to him who doesn't work, but believes in him who justifies the ungodly, his faith is accounted for righteousness.పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.
6 Even as David also pronounces blessing on the man to whom God counts righteousness apart from works,ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.
7 "Blessed are they whose iniquities are forgiven, Whose sins are covered.ఏలా గనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
8 Blessed is the man whom the Lord will by no means charge with sin."ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
9 Is this blessing then pronounced on the circumcised, or on the uncircumcised also? For we say that faith was accounted to Abraham for righteousness.ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా?
10 How then was it counted? When he was in circumcision, or in uncircumcision? Not in circumcision, but in uncircumcision.మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను?సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.
11 He received the sign of circumcision, a seal of the righteousness of the faith which he had while he was in uncircumcision, that he might be the father of all those who believe, though they be in uncircumcision, that righteousness might also be accounted to them.మరియు సున్నతి లేని వారైనను, నమి్మనవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
12 The father of circumcision to those who not only are of the circumcision, but who also walk in the steps of that faith of our father Abraham, which he had in uncircumcision.మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.
13 For the promise to Abraham and to his seed that he should be heir of the world wasn't through the law, but through the righteousness of faith.అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.
14 For if those who are of the law are heirs, faith is made void, and the promise is made of no effect.ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును.
15 For the law works wrath, for where there is no law, neither is there disobedience.ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేక పోవును.
16 For this cause it is of faith, that it may be according to grace, to the end that the promise may be sure to all the seed, not to that only which is of the law, but to that also which is of the faith of Abraham, who is the father of us all.ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.
17 As it is written, "I have made you a father of many nations." This is in the presence of him whom he believed: God, who gives life to the dead, and calls the things that are not, as though they were.తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడుఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.
18 Who in hope believed against hope, to the end that he might become a father of many nations, according to that which had been spoken, "So will your seed be."నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
19 Without being weakened in faith, he didn't consider his own body, already having been worn out, (he being about a hundred years old), and the deadness of Sarah's womb.మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భéమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
20 Yet, looking to the promise of God, he didn't waver through unbelief, but grew strong through faith, giving glory to God,అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21 and being fully assured that what he had promised, he was able also to perform.దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
22 Therefore it also was "reckoned to him for righteousness."అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
23 Now it was not written that it was accounted to him for his sake alone,అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
24 but for our sake also, to whom it will be accounted, who believe in him who raised Jesus, our Lord, from the dead,మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
25 who was delivered up for our trespasses, and was raised for our justification.ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
Telugu Bible