Bible

Romans 4 - BBE (Telugu)

1 What, then, may we say that Abraham, our father after the flesh, has got?కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.

2 For if Abraham got righteousness by works, he has reason for pride; but not before God.అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.

3 But what does it say in the holy Writings? And Abraham had faith in God, and it was put to his account as righteousness.లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను

4 Now, the reward is credited to him who does works, not as of grace but as a debt.పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.

5 But to him who without working has faith in him who gives righteousness to the evil-doer, his faith is put to his account as righteousness.పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

6 As David says that there is a blessing on the man to whose account God puts righteousness without works, saying,ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.

7 Happy are those who have forgiveness for their wrongdoing, and whose sins are covered.ఏలా గనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

8 Happy is the man against whom no sin is recorded by the Lord.ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,

9 Is this blessing, then, for the circumcision only, or in the same way for those who have not circumcision? for we say that the faith of Abraham was put to his account as righteousness.ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా?

10 How, then, was it judged? when he had circumcision, or when he had it not? Not when he had it, but when he did not have it:మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను?సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.

11 And he was given the sign of circumcision as a witness of the faith which he had before he underwent circumcision: so that he might be the father of all those who have faith, though they have not circumcision, and so that righteousness might be put to their account;మరియు సున్నతి లేని వారైనను, నమి్మనవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.

12 And the father of circumcision to those who not only are of the circumcision, but who keep to the way of that faith which our father Abraham had before he underwent circumcision.మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.

13 For God's word, that the earth would be his heritage, was given to Abraham, not through the law, but through the righteousness of faith.అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.

14 For if they who are of the law are the people who get the heritage, then faith is made of no use, and the word of God has no power;ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును.

15 For the outcome of the law is wrath; but where there is no law it will not be broken.ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేక పోవును.

16 For this reason it is of faith, so that it may be through grace; and so that the word of God may be certain to all the seed; not only to that which is of the law, but to that which is of the faith of Abraham, who is the father of us all,ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

17 (As it is said in the holy Writings, I have made you a father of a number of nations) before him in whom he had faith, that is, God, who gives life to the dead, and to whom the things which are not are as if they were.తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడుఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18 Who without reason for hope, in faith went on hoping, so that he became the father of a number of nations, as it had been said, So will your seed be.నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19 And not being feeble in faith though his body seemed to him little better than dead (he being about a hundred years old) and Sarah was no longer able to have children:మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భéమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20 Still, he did not give up faith in the undertaking of God, but was made strong by faith, giving glory to God,అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21 And being certain that God was able to keep his word.దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22 For which reason it was put to his account as righteousness.అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

23 Now, it was not because of him only that this was said,అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని

24 But for us in addition, to whose account it will be put, if we have faith in him who made Jesus our Lord come back again from the dead,మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.

25 Who was put to death for our evil-doing, and came to life again so that we might have righteousness.ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

Telugu Bible