Bible

Romans 16 - BBE (Telugu)

1 It is my desire to say a good word for Phoebe, who is a servant of the church in Cenchreae:కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,

2 That you will take her in kindly, after the way of the saints, as one who is the Lord's, and give her help in anything in which she may have need of you: because she has been a help to a great number and to myself.ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.

3 Give my love to Prisca and Aquila, workers with me in Christ Jesus,క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.

4 Who for my life put their necks in danger; to whom not only I but all the churches of the Gentiles are in debt:వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.

5 And say a kind word to the church which is in their house. Give my love to my dear Epaenetus, who is the first fruit of Asia to Christ.ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.

6 Give my love to Mary, who gave much care to you.మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.

7 Give my love to Andronicus and Junia, my relations, who were in prison with me, who are noted among the Apostles, and who were in Christ before me.నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

8 Give my love to Ampliatus, who is dear to me in the Lord,ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వంద నములు.

9 Give my love to Urbanus, a worker in Christ with us, and to my dear Stachys.క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.

10 Give my love to Apelles, who has the approval of Christ. Say a kind word to those who are of the house of Aristobulus.క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.

11 Give my love to Herodion, my relation. Say a kind word to those of the house of Narcissus, who are in the Lord.నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.

12 Give my love to Tryphaena and Tryphosa, workers in the Lord. Give my love to my dear Persis, who did much work in the Lord.ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.

13 Give my love to Rufus, one of the Lord's selection, and to his mother and mine.ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వంద నములు; ఆమె నాకును తల్లి.

14 Give my love to Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brothers who are with them.అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు.

15 Give my love to Philologus and Julia, Nereus and his sister, and Olympas, and all the saints who are with them.పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.

16 Give one another a holy kiss. All the churches of Christ send their love to you.పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

17 Now, it is my desire, brothers, that you will take note of those who are causing division and trouble among you, quite against the teaching which was given to you: and keep away from them.సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

18 For such people are not servants of the Lord Christ, but of their stomachs; and by their smooth and well-said words the hearts of those who have no knowledge of evil are tricked.అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

19 For all have knowledge of how you do what you are ordered. For this reason I have joy in you, but it is my desire that you may be wise in what is good, and without knowledge of evil.మీ విధేయత అందరికిని ప్రచుర మైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.

20 And the God of peace will be crushing Satan under your feet before long. The grace of our Lord Jesus Christ be with you.సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

21 Timothy, who is working with me, sends his love to you, so do Lucius and Jason and Sosipater, my relations.నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

22 I, Tertius, who have done the writing of this letter, send love in the Lord.ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.

23 Gaius, with whom I am living, whose house is open to all the church, sends his love, so does Erastus, the manager of the accounts of the town, and Quartus, the brother.నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

24 []మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

25 Now to him who is able to make you strong in agreement with the good news which I gave you and the preaching of Jesus Christ, in the light of the revelation of that secret which has been kept through times eternal,సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

26 But is now made clear; and by the writings of the prophets, by the order of the eternal God, the knowledge of it has been given to all the nations, so that they may come under the rule of the faith;యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

27 To the only wise God, through Jesus Christ, be the glory for ever. So be it.అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

Telugu Bible