Psalm 98 - BBE (Telugu)
1 <A Psalm.> O make a new song to the Lord, because he has done works of wonder; with his right hand, and with his holy arm, he has overcome.యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
2 The Lord has given to all the knowledge of his salvation; he has made clear his righteousness in the eyes of the nations.యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.
3 He has kept in mind his mercy and his unchanging faith to the house of Israel; all the ends of the earth have seen the salvation of our God.ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.
4 Let all the earth send out a glad cry to the Lord; sounding with a loud voice, and praising him with songs of joy.సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.
5 Make melody to the Lord with instruments of music; with a corded instrument and the voice of song.సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.
6 With wind instruments and the sound of the horn, make a glad cry before the Lord, the King.బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
7 Let the sea be thundering, with all its waters; the world, and all who are living in it;సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
8 Let the streams make sounds of joy with their hands; let the mountains be glad together,ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
9 Before the Lord, for he has come as judge of the earth; judging the world in righteousness, and giving true decisions for the peoples.భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
Telugu Bible