Bible

Psalm 85 - WEB (Telugu)

1 > Yahweh, you have been favorable to your land. You have restored the fortunes of Jacob.యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.

2 You have forgiven the iniquity of your people. You have covered all their sin. Selah.నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)

3 You have taken away all your wrath. You have turned from the fierceness of your anger.నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు

4 Turn us, God of our salvation, And cause your indignation toward us to cease.మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.మా మీదనున్న నీ కోపము చాలించుము.

5 Will you be angry with us forever? Will you draw out your anger to all generations?ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?

6 Won't you revive us again, That your people may rejoice in you?నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?

7 Show us your loving kindness, Yahweh. Grant us your salvation.యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.

8 I will hear what God, Yahweh, will speak, For he will speak peace to his people, his saints; But let them not turn again to folly.దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.

9 Surely his salvation is near those who fear him, That glory may dwell in our land.మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

10 Mercy and truth meet together. Righteousness and peace have kissed each other.కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.

11 Truth springs out of the earth. Righteousness has looked down from heaven.భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.

12 Yes, Yahweh will give that which is good. Our land will yield its increase.యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.

13 Righteousness goes before him, And prepares the way for his steps.నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.

Telugu Bible