Bible

Psalm 140 - WEB (Telugu)

1 > Deliver me, Yahweh, from the evil man. Preserve me from the violent man;యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి పింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము.

2 Those who devise mischief in their hearts. They continually gather themselves together for war.వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.

3 They have sharpened their tongues like a serpent. Viper's poison is under their lips. Selah.పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

4 Yahweh, keep me from the hands of the wicked. Preserve me from the violent men who have determined to trip my feet.యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపా డుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షిం పుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు.

5 The proud have hidden a snare for me, They have spread the cords of a net by the path. They have set traps for me. Selah.గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)

6 I said to Yahweh, "You are my God." Listen to the cry of my petitions, Yahweh.అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.

7 Yahweh, the Lord, the strength of my salvation, You have covered my head in the day of battle.ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.

8 Yahweh, don't grant the desires of the wicked. Don't let their evil plans succeed, or they will become proud. Selah.యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా.)

9 As for the head of those who surround me, Let the mischief of their own lips cover them.నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక

10 Let burning coals fall on them. Let them be thrown into the fire, Into miry pits, from where they never rise.కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక

11 An evil speaker won't be established in the earth. Evil will hunt the violent man to overthrow him.కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.

12 I know that Yahweh will maintain the cause of the afflicted, And justice for the needy.బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగు దును.

13 Surely the righteous will give thanks to your name. The upright will dwell in your presence.నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.

Telugu Bible