Proverbs 7 - KJV (Telugu)
1 My son, keep my words, and lay up my commandments with thee.నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
2 Keep my commandments, and live; and my law as the apple of thine eye.నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
3 Bind them upon thy fingers, write them upon the table of thine heart.నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
4 Say unto wisdom, Thou art my sister; and call understanding thy kinswoman:జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
5 That they may keep thee from the strange woman, from the stranger which flattereth with her words.అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.
6 For at the window of my house I looked through my casement,నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను
7 And beheld among the simple ones, I discerned among the youths, a young man void of understanding,¸°వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
8 Passing through the street near her corner; and he went the way to her house,సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
9 In the twilight, in the evening, in the black and dark night:వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
10 And, behold, there met him a woman with the attire of an harlot, and subtil of heart.అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
11 (She is loud and stubborn; her feet abide not in her house:అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
12 Now is she without, now in the streets, and lieth in wait at every corner.)ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
13 So she caught him, and kissed him, and with an impudent face said unto him,అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను
14 I have peace offerings with me; this day have I payed my vows.సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
15 Therefore came I forth to meet thee, diligently to seek thy face, and I have found thee.కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
16 I have decked my bed with coverings of tapestry, with carved works, with fine linen of Egypt.నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
17 I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
18 Come, let us take our fill of love until the morning: let us solace ourselves with loves.ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
19 For the goodman is not at home, he is gone a long journey:పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
20 He hath taken a bag of money with him, and will come home at the day appointed.అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
21 With her much fair speech she caused him to yield, with the flattering of her lips she forced him.అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
22 He goeth after her straightway, as an ox goeth to the slaughter, or as a fool to the correction of the stocks;వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
23 Till a dart strike through his liver; as a bird hasteth to the snare, and knoweth not that it is for his life.తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
24 Hearken unto me now therefore, O ye children, and attend to the words of my mouth.నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
25 Let not thine heart decline to her ways, go not astray in her paths.జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
26 For she hath cast down many wounded: yea, many strong men have been slain by her.అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
27 Her house is the way to hell, going down to the chambers of death.దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
Telugu Bible