Proverbs 6 - WEB (Telugu)
1 My son, if you have become collateral for your neighbor, If you have struck your hands in pledge for a stranger;నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల
2 You are trapped by the words of your mouth. You are ensnared with the words of your mouth.నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు
3 Do this now, my son, and deliver yourself, Seeing you have come into the hand of your neighbor. Go, humble yourself. Press your plea with your neighbor.నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.
4 Give no sleep to your eyes, Nor slumber to your eyelids.ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.
5 Free yourself, like a gazelle from the hand of the hunter, Like a bird from the snare of the fowler.వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.
6 Go to the ant, you sluggard. Consider her ways, and be wise;సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
7 Which having no chief, overseer, or ruler,వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
8 Provides her bread in the summer, And gathers her food in the harvest.అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
9 How long will you sleep, sluggard? When will you arise out of your sleep?సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?
10 A little sleep, a little slumber, A little folding of the hands to sleep:ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు
11 So your poverty will come as a robber, And your scarcity as an armed man.అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
12 A worthless person, a man of iniquity, Is he who walks with a perverse mouth;కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు
13 Who winks with his eyes, who signals with his feet, Who motions with his fingers;వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును.
14 In whose heart is perverseness, Who devises evil continually, Who always sows discord.వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
15 Therefore his calamity will come suddenly. He will be broken suddenly, and that without remedy.కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.
16 There are six things which Yahweh hates; Yes, seven which are an abomination to him:యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు
17 Haughty eyes, a lying tongue, Hands that shed innocent blood;అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును
18 A heart that devises wicked schemes, Feet that are swift in running to mischief,దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
19 A false witness who utters lies, And he who sows discord among brothers.లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
20 My son, keep your father's commandment, And don't forsake your mother's teaching.నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.
21 Bind them continually on your heart. Tie them around your neck.వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
22 When you walk, it will lead you. When you sleep, it will watch over you. When you awake, it will talk with you.నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
23 For the commandment is a lamp, And the law is light. Reproofs of instruction are the way of life,ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
24 To keep you from the immoral woman, From the flattery of the wayward wife's tongue.చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.
25 Don't lust after her beauty in your heart, Neither let her captivate you with her eyelids.దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
26 For a prostitute reduces you to a piece of bread. The adulteress hunts for your precious life.వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
27 Can a man scoop fire into his lap, And his clothes not be burned?ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?
28 Or can one walk on hot coals, And his feet not be scorched?ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?
29 So is he who goes in to his neighbor's wife. Whoever touches her will not be unpunished.తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
30 Men don't despise a thief, If he steals to satisfy himself when he is hungry:దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.
31 But if he is found, he shall restore seven times. He shall give all the wealth of his house.వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.
32 He who commits adultery with a woman is void of understanding. He who does it destroys his own soul.జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
33 He will get wounds and dishonor. His reproach will not be wiped away.వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.
34 For jealousy arouses the fury of the husband. He won't spare in the day of vengeance.భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు.
35 He won't regard any ransom, Neither will he rest content, though you give many gifts.ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పు కొనడు.
Telugu Bible