Proverbs 5 - BBE (Telugu)
1 My son, give attention to my wisdom; let your ear be turned to my teaching:నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
2 So that you may be ruled by a wise purpose, and your lips may keep knowledge.అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
3 For honey is dropping from the lips of the strange woman, and her mouth is smoother than oil;జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
4 But her end is bitter as wormwood, and sharp as a two-edged sword;దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,
5 Her feet go down to death, and her steps to the underworld;దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును
6 She never keeps her mind on the road of life; her ways are uncertain, she has no knowledge.అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.
7 Give ear to me then, my sons, and do not put away my words from you.కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.
8 Go far away from her, do not come near the door of her house;జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
9 For fear that you may give your honour to others, and your wealth to strange men:వెళ్లినయెడల పరులకు నీ ¸°వనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు
10 And strange men may be full of your wealth, and the fruit of your work go to the house of others;నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.
11 And you will be full of grief at the end of your life, when your flesh and your body are wasted;తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు
12 And you will say, How was teaching hated by me, and my heart put no value on training;అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?
13 I did not give attention to the voice of my teachers, my ear was not turned to those who were guiding me!నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు
14 I was in almost all evil in the company of the people.నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు గుచు నుందువు.
15 Let water from your store and not that of others be your drink, and running water from your fountain.నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
16 Let not your springs be flowing in the streets, or your streams of water in the open places.నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
17 Let them be for yourself only, not for other men with you.అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
18 Let blessing be on your fountain; have joy in the wife of your early years.నీ ఊట దీవెన నొందును. నీ ¸°వనకాలపు భార్యయందు సంతోషింపుము.
19 As a loving hind and a gentle doe, let her breasts ever give you rapture; let your passion at all times be moved by her love.ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
20 Why let yourself, my son, go out of the way with a strange woman, and take another woman in your arms?నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
21 For a man's ways are before the eyes of the Lord, and he puts all his goings in the scales.నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
22 The evil-doer will be taken in the net of his crimes, and prisoned in the cords of his sin.దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
23 He will come to his end for need of teaching; he is so foolish that he will go wandering from the right way.శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.
Telugu Bible