Proverbs 4 - WEB (Telugu)
1 Listen, sons, to a father's instruction. Pay attention and know understanding;కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
2 For I give you sound learning. Don't forsake my law.నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
3 For I was a son to my father, Tender and an only child in the sight of my mother.నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమా రుడనైయుంటిని.
4 He taught me, and said to me: "Let your heart retain my words. Keep my commandments, and live.ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
5 Get wisdom. Get understanding. Don't forget, neither swerve from the words of my mouth.జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.
6 Don't forsake her, and she will preserve you. Love her, and she will keep you.జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
7 Wisdom is supreme. Get wisdom. Yes, though it costs all your possessions, get understanding.జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము.
8 Esteem her, and she will exalt you. She will bring you to honor, when you embrace her.దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
9 She will give to your head a garland of grace. She will deliver a crown of splendor to you."అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
10 Listen, my son, and receive my sayings. The years of your life will be many.నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
11 I have taught you in the way of wisdom. I have led you in straight paths.జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
12 When you go, your steps will not be hampered. When you run, you will not stumble.నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
13 Take firm hold of instruction. Don't let her go. Keep her, for she is your life.ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టు కొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
14 Don't enter into the path of the wicked. Don't walk in the way of evil men.భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
15 Avoid it, and don't pass by it. Turn from it, and pass on.దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
16 For they don't sleep, unless they do evil. Their sleep is taken away, unless they make someone fall.అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
17 For they eat the bread of wickedness, And drink the wine of violence.కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
18 But the path of the righteous is like the dawning light, That shines more and more until the perfect day.పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
19 The way of the wicked is like darkness. They don't know what they stumble over.భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
20 My son, attend to my words. Turn your ear to my sayings.నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
21 Let them not depart from your eyes. Keep them in the midst of your heart.నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
22 For they are life to those who find them, And health to their whole body.దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
23 Keep your heart with all diligence, For out of it is the wellspring of life.నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
24 Put away from yourself a perverse mouth. Put corrupt lips far from you.మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
25 Let your eyes look straight ahead. Fix your gaze directly before you.నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
26 Make the path of your feet level. Let all of your ways be established.నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
27 Don't turn to the right hand nor to the left. Remove your foot from evil.నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.
Telugu Bible