Bible

Proverbs 31 - DBY (Telugu)

1 The words of king Lemuel, the prophecy that his mother taught him:రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి,

2 What, my son? and what, O son of my womb? and what, O son of my vows?నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమా రుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును?

3 Give not thy strength unto women, nor thy ways to them that destroy kings.నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ కుము

4 It is not for kings, Lemuel, it is not for kings to drink wine, nor for rulers [to say], Where is the strong drink?ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు.

5 -- lest they drink and forget the law, and pervert the judgment of any of the children of affliction.త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు

6 Give strong drink unto him that is ready to perish, and wine unto the bitter of soul:ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.

7 let him drink, and forget his poverty, and remember his misery no more.వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు.

8 Open thy mouth for the dumb, for the cause of all those that are left desolate.మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము.

9 Open thy mouth, judge righteously, and minister justice to the afflicted and needy.నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.

10 Who can find a woman of worth? for her price is far above rubies.గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.

11 The heart of her husband confideth in her, and he shall have no lack of spoil.ఆమె పెనిమిటి ఆమెయందు నమి్మకయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.

12 She doeth him good, and not evil, all the days of her life.ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.

13 She seeketh wool and flax, and worketh willingly with her hands.ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.

14 She is like the merchants' ships: she bringeth her food from afar;వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.

15 And she riseth while it is yet night, and giveth meat to her household, and the day's work to her maidens.ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.

16 She considereth a field, and acquireth it; of the fruit of her hands she planteth a vineyard.ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.

17 She girdeth her loins with strength, and maketh strong her arms.ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును

18 She perceiveth that her earning is good; her lamp goeth not out by night.తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.

19 She putteth her hands to the distaff, and her hands hold the spindle.ఆమె పంటెను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.

20 She stretcheth out her hand to the afflicted, and she reacheth forth her hands to the needy.దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును

21 She is not afraid of the snow for her household; for all her household are clothed with scarlet.తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.

22 She maketh herself coverlets; her clothing is byssus and purple.ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.

23 Her husband is known in the gates, when he sitteth among the elders of the land.ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.

24 She maketh body linen and selleth it, and delivereth girdles unto the merchant.ఆమె నారబట్టలు నేయించి అమ్మునునడికట్లను వర్తకులకు అమ్మును.

25 Strength and dignity are her clothing, and she laugheth [at] the coming day.బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.

26 She openeth her mouth with wisdom; and upon her tongue is the law of kindness.జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

27 She surveyeth the ways of her household, and eateth not the bread of idleness.ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

28 Her children rise up and call her blessed; her husband [also], and he praiseth her:ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి

29 Many daughters have done worthily, but thou excellest them all.యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.

30 Gracefulness is deceitful and beauty is vain; a woman [that] feareth Jehovah, she shall be praised.అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును

31 Give her of the fruit of her hands, and let her own works praise her in the gates.చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.

Telugu Bible