Bible

Proverbs 29 - BBE (Telugu)

1 A man hating sharp words and making his heart hard, will suddenly be broken and will not be made well again.ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

2 When the upright have power, the people are glad; when an evil man is ruler, grief comes on the people.నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.

3 A man who is a lover of wisdom is a joy to his father: but he who goes in the company of loose women is a waster of wealth.జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.

4 A king, by right rule, makes the land safe; but one full of desires makes it a waste.న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.

5 A man who says smooth things to his neighbour is stretching out a net for his steps.తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.

6 In the steps of an evil man there is a net for him, but the upright man gets away quickly and is glad.దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును.

7 The upright man gives attention to the cause of the poor: the evil-doer gives no thought to it.నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.

8 Men of pride are the cause of violent acts in a town, but by wise men wrath is turned away.అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.

9 If a wise man goes to law with a foolish man, he may be angry or laughing, but there will be no rest.జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.

10 Men of blood are haters of the good man, and evil-doers go after his soul.నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.

11 A foolish man lets out all his wrath, but a wise man keeps it back quietly.బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూప కుండును.

12 If a ruler gives attention to false words, all his servants are evil-doers.అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు

13 The poor man and his creditor come face to face: the Lord gives light to their eyes equally.బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.

14 The king who is a true judge in the cause of the poor, will be safe for ever on the seat of his power.ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.

15 The rod and sharp words give wisdom: but a child who is not guided is a cause of shame to his mother.బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.

16 When evil men are in power, wrongdoing is increased; but the upright will have pleasure when they see their downfall.దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచె దరు.

17 Give your son training, and he will give you rest; he will give delight to your soul.నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును

18 Where there is no vision, the people are uncontrolled; but he who keeps the law will be happy.దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.

19 A servant will not be trained by words; for though the sense of the words is clear to him, he will not give attention.దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు

20 Have you seen a man who is quick with his tongue? There is more hope for a foolish man than for him.ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.

21 If a servant is gently cared for from his early years, he will become a cause of sorrow in the end.ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమా రుడుగా ఎంచబడును.

22 An angry man is the cause of fighting, and a man given to wrath does much wrong.కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.

23 A man's pride will be the cause of his fall, but he who has a gentle spirit will get honour.ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును

24 A man who takes part with a thief has hate for his soul; he is put under oath, but says nothing.దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.

25 The fear of man is a cause of danger: but whoever puts his faith in the Lord will have a safe place on high.భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును.

26 The approval of a ruler is desired by great numbers: but the decision in a man's cause comes from the Lord.అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.

27 An evil man is disgusting to the upright, and he who is upright is disgusting to evil-doers.దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.

Telugu Bible