Bible

Proverbs 27 - KJV (Telugu)

1 Boast not thyself of to morrow; for thou knowest not what a day may bring forth.రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.

2 Let another man praise thee, and not thine own mouth; a stranger, and not thine own lips.నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.

3 A stone is heavy, and the sand weighty; but a fool's wrath is heavier than them both.రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.

4 Wrath is cruel, and anger is outrageous; but who is able to stand before envy?క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

5 Open rebuke is better than secret love.లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు

6 Faithful are the wounds of a friend; but the kisses of an enemy are deceitful.మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

7 The full soul loatheth an honeycomb; but to the hungry soul every bitter thing is sweet.కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కి వేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.

8 As a bird that wandereth from her nest, so is a man that wandereth from his place.తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.

9 Ointment and perfume rejoice the heart: so doth the sweetness of a man's friend by hearty counsel.తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.

10 Thine own friend, and thy father's friend, forsake not; neither go into thy brother's house in the day of thy calamity: for better is a neighbour that is near than a brother far off.నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,

11 My son, be wise, and make my heart glad, that I may answer him that reproacheth me.నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.

12 A prudent man foreseeth the evil, and hideth himself; but the simple pass on, and are punished.బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.

13 Take his garment that is surety for a stranger, and take a pledge of him for a strange woman.ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.

14 He that blesseth his friend with a loud voice, rising early in the morning, it shall be counted a curse to him.వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచ బడును.

15 A continual dropping in a very rainy day and a contentious woman are alike.ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము

16 Whosoever hideth her hideth the wind, and the ointment of his right hand, which bewrayeth itself.దానిని ఆపజూచువాడు గాలిని అపజూచువాని తోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమా నుడు.

17 Iron sharpeneth iron; so a man sharpeneth the countenance of his friend.ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.

18 Whoso keepeth the fig tree shall eat the fruit thereof: so he that waiteth on his master shall be honoured.అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.

19 As in water face answereth to face, so the heart of man to man.నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.

20 Hell and destruction are never full; so the eyes of man are never satisfied.పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానే రదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.

21 As the fining pot for silver, and the furnace for gold; so is a man to his praise.మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.

22 Though thou shouldest bray a fool in a mortar among wheat with a pestle, yet will not his foolishness depart from him.మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.

23 Be thou diligent to know the state of thy flocks, and look well to thy herds.నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.

24 For riches are not for ever: and doth the crown endure to every generation?ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?

25 The hay appeareth, and the tender grass sheweth itself, and herbs of the mountains are gathered.ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది

26 The lambs are for thy clothing, and the goats are the price of the field.నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును

27 And thou shalt have goats' milk enough for thy food, for the food of thy household, and for the maintenance for thy maidens.నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.

Telugu Bible