Bible

Proverbs 23 - YLT (Telugu)

1 When thou sittest to eat with a ruler, Thou considerest diligently that which `is' before thee,నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచిం చుము.

2 And thou hast put a knife to thy throat, If thou `art' a man of appetite.నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.

3 Have no desire to his dainties, seeing it `is' lying food.అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.

4 Labour not to make wealth, From thine own understanding cease, Dost thou cause thine eyes to fly upon it? Then it is not.ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.

5 For wealth maketh to itself wings, As an eagle it flieth to the heavens.నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.

6 Eat not the bread of an evil eye, And have no desire to his dainties,ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.

7 For as he hath thought in his soul, so `is' he, `Eat and drink,' saith he to thee, And his heart `is' not with thee.అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.

8 Thy morsel thou hast eaten thou dost vomit up, And hast marred thy words that `are' sweet.నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.

9 In the ears of a fool speak not, For he treadeth on the wisdom of thy words.బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.

10 Remove not a border of olden times, And into fields of the fatherless enter not,పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు

11 For their Redeemer `is' strong, He doth plead their cause with thee.వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

12 Bring in to instruction thy heart, And thine ear to sayings of knowledge.ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.

13 Withhold not from a youth chastisement, When thou smitest him with a rod he dieth not.నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును

14 Thou with a rod smitest him, And his soul from Sheol thou deliverest.బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.

15 My son, if thy heart hath been wise, My heart rejoiceth, even mine,నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.

16 And my reins exult when thy lips speak uprightly.నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.

17 Let not thy heart be envious at sinners, But -- in the fear of Jehovah all the day.పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.

18 For, is there a posterity? Then thy hope is not cut off.నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.

19 Hear thou, my son, and be wise, And make happy in the way thy heart,నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.

20 Be not thou among quaffers of wine, Among gluttonous ones of flesh,ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహ వాసము చేయకుము.

21 For the quaffer and glutton become poor, And drowsiness clotheth with rags.త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.

22 Hearken to thy father, who begat thee, And despise not thy mother when she hath become old.నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.

23 Truth buy, and sell not, Wisdom, and instruction, and understanding,సత్యమును అమి్మవేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.

24 The father of the righteous rejoiceth greatly, The begetter of the wise rejoiceth in him.నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.

25 Rejoice doth thy father and thy mother, Yea, she that bare thee is joyful.నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.

26 Give, my son, thy heart to me, And let thine eyes watch my ways.నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,

27 For a harlot `is' a deep ditch, And a strange woman `is' a strait pit.వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.

28 She also, as catching prey, lieth in wait, And the treacherous among men she increaseth.దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.

29 Who hath wo? who hath sorrow? Who hath contentions? who hath plaint? Who hath wounds without cause? Who hath redness of eyes?ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?

30 Those tarrying by the wine, Those going in to search out mixed wine.ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.

31 See not wine when it showeth itself red, When it giveth in the cup its colour, It goeth up and down through the upright.ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.

32 Its latter end -- as a serpent it biteth, And as a basilisk it stingeth.పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.

33 Thine eyes see strange women, And thy heart speaketh perverse things.విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

34 And thou hast been as one lying down in the heart of the sea, And as one lying down on the top of a mast.నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.

35 `They smote me, I have not been sick, They beat me, I have not known. When I awake -- I seek it yet again!'నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

Telugu Bible