Proverbs 23 - ASV (Telugu)
1 When thou sittest to eat with a ruler, Consider diligently him that is before thee;నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచిం చుము.
2 And put a knife to thy throat, If thou be a man given to appetite.నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
3 Be not desirous of his dainties; Seeing they are deceitful food.అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.
4 Weary not thyself to be rich; Cease from thine own wisdom.ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
5 Wilt thou set thine eyes upon that which is not? For `riches' certainly make themselves wings, Like an eagle that flieth toward heaven.నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.
6 Eat thou not the bread of him that hath an evil eye, Neither desire thou his dainties:ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.
7 For as he thinketh within himself, so is he: Eat and drink, saith he to thee; But his heart is not with thee.అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.
8 The morsel which thou hast eaten shalt thou vomit up, And lose thy sweet words.నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.
9 Speak not in the hearing of a fool; For he will despise the wisdom of thy words.బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.
10 Remove not the ancient landmark; And enter not into the fields of the fatherless:పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు
11 For their Redeemer is strong; He will plead their cause against thee.వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
12 Apply thy heart unto instruction, And thine ears to the words of knowledge.ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
13 Withhold not correction from the child; `For' if thou beat him with the rod, he will not die.నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
14 Thou shalt beat him with the rod, And shalt deliver his soul from Sheol.బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.
15 My son, if thy heart be wise, My heart will be glad, even mine:నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
16 Yea, my heart will rejoice, When thy lips speak right things.నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
17 Let not thy heart envy sinners; But `be thou' in the fear of Jehovah all the day long:పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
18 For surely there is a reward; And thy hope shall not be cut off.నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
19 Hear thou, my son, and be wise, And guide thy heart in the way.నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.
20 Be not among winebibbers, Among gluttonous eaters of flesh:ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహ వాసము చేయకుము.
21 For the drunkard and the glutton shall come to poverty; And drowsiness will clothe `a man' with rags.త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
22 Hearken unto thy father that begat thee, And despise not thy mother when she is old.నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
23 Buy the truth, and sell it not; `Yea', wisdom, and instruction, and understanding.సత్యమును అమి్మవేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.
24 The father of the righteous will greatly rejoice; And he that begetteth a wise child will have joy of him.నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.
25 Let thy father and thy mother be glad, And let her that bare thee rejoice.నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.
26 My son, give me thy heart; And let thine eyes delight in my ways.నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
27 For a harlot is a deep ditch; And a foreign woman is a narrow pit.వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
28 Yea, she lieth in wait as a robber, And increaseth the treacherous among men.దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.
29 Who hath woe? who hath sorrow? who hath contentions? Who hath complaining? who hath wounds without cause? Who hath redness of eyes?ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
30 They that tarry long at the wine; They that go to seek out mixed wine.ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
31 Look not thou upon the wine when it is red, When it sparkleth in the cup, When it goeth down smoothly:ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
32 At the last it biteth like a serpent, And stingeth like an adder.పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
33 Thine eyes shall behold strange things, And thy heart shall utter perverse things.విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
34 Yea, thou shalt be as he that lieth down in the midst of the sea, Or as he that lieth upon the top of a mast.నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.
35 They have stricken me, `shalt thou say', and I was not hurt; They have beaten me, and I felt it not: When shall I awake? I will seek it yet again.నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.
Telugu Bible