Bible

Proverbs 20 - DBY (Telugu)

1 Wine is a scorner, strong drink is raging; and whoso erreth thereby is not wise.ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

2 The terror of a king is as the roaring of a lion: he that provoketh him to anger sinneth against his own soul.రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు

3 It is an honour for a man to cease from strife; but every fool rusheth into it.కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

4 The sluggard will not plough by reason of the winter; he shall beg in harvest, and have nothing.విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించు నప్పుడు వానికేమియు లేకపోవును.

5 Counsel in the heart of man is deep water, and a man of understanding draweth it out.నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.

6 Most men will proclaim every one his own kindness; but a faithful man who shall find?దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

7 The righteous walketh in his integrity: blessed are his children after him!యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

8 A king sitting on the throne of judgment scattereth away all evil with his eyes.న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.

9 Who can say, I have made my heart clean, I am pure from my sin?నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?

10 Divers weights, divers measures, even both of them are abomination to Jehovah.వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.

11 Even a child is known by his doings, whether his work be pure, and whether it be right.బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.

12 The hearing ear, and the seeing eye, Jehovah hath made even both of them.వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

13 Love not sleep, lest thou come to poverty; open thine eyes, [and] thou shalt be satisfied with bread.లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

14 Bad! bad! saith the buyer; but when he is gone his way, then he boasteth.కొనువాడుజబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.

15 There is gold, and a multitude of rubies; but the lips of knowledge are a precious Jewel.బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

16 Take his garment that is become surety [for] another, and hold him in pledge for strangers.అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము

17 Bread of falsehood is sweet to a man, but afterwards his mouth shall be filled with gravel.మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

18 Plans are established by counsel; and with good advice make war.ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

19 He that goeth about talebearing revealeth secrets; therefore meddle not with him that openeth his lips.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

20 Whoso curseth his father or his mother, his lamp shall be put out in the blackest darkness.తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

21 An inheritance obtained hastily at the beginning will not be blessed in the end.మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.

22 Say not, I will recompense evil: wait on Jehovah, and he shall save thee.కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.

23 Divers weights are an abomination unto Jehovah; and a false balance is not good.వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.

24 The steps of a man are from Jehovah; and how can a man understand his own way?ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?

25 It is a snare to a man rashly to say, It is hallowed, and after vows to make inquiry.వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు టయు ఒకనికి ఉరియగును.

26 A wise king scattereth the wicked, and bringeth the wheel over them.జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.

27 Man's spirit is the lamp of Jehovah, searching all the inner parts of the belly.నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.

28 Mercy and truth preserve the king; and he upholdeth his throne by mercy.కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.

29 The glory of young men is their strength; and the beauty of old men is the grey head.¸°వనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము

30 Wounding stripes purge away evil, and strokes [purge] the inner parts of the belly.గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం చును.

Telugu Bible