Proverbs 20 - ASV (Telugu)
1 Wine is a mocker, strong drink a brawler; And whosoever erreth thereby is not wise.ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
2 The terror of a king is as the roaring of a lion: He that provoketh him to anger sinneth `against' his own life.రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు
3 It is an honor for a man to keep aloof from strife; But every fool will be quarrelling.కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
4 The sluggard will not plow by reason of the winter; Therefore he shall beg in harvest, and have nothing.విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించు నప్పుడు వానికేమియు లేకపోవును.
5 Counsel in the heart of man is `like' deep water; But a man of understanding will draw it out.నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.
6 Most men will proclaim every one his own kindness; But a faithful man who can find?దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?
7 A righteous man that walketh in his integrity, Blessed are his children after him.యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.
8 A king that sitteth on the throne of judgment Scattereth away all evil with his eyes.న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.
9 Who can say, I have made my heart clean, I am pure from my sin?నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?
10 Diverse weights, and diverse measures, Both of them alike are an abomination to Jehovah.వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
11 Even a child maketh himself known by his doings, Whether his work be pure, and whether it be right.బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.
12 The hearing ear, and the seeing eye, Jehovah hath made even both of them.వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.
13 Love not sleep, let thou come to poverty; Open thine eyes, `and' thou shalt be satisfied with bread.లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.
14 It is bad, it is bad, saith the buyer; But when he is gone his way, then he boasteth.కొనువాడుజబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.
15 There is gold, and abundance of rubies; But the lips of knowledge are a precious jewel.బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.
16 Take his garment that is surety for a stranger; And hold him in pledge `that is surety' for foreigners.అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
17 Bread of falsehood is sweet to a man; But afterwards his mouth shall be filled with gravel.మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
18 Every purpose is established by counsel; And by wise guidance make thou war.ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.
19 He that goeth about as a tale-bearer revealeth secrets; Therefore company not with him that openeth wide his lips.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.
20 Whoso curseth his father or his mother, His lamp shall be put out in blackness of darkness.తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.
21 An inheritance `may be' gotten hastily at the beginning; But the end thereof shall not be blessed.మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.
22 Say not thou, I will recompense evil: Wait for Jehovah, and he will save thee.కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.
23 Diverse weights are an abomination to Jehovah; And a false balance is not good.వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.
24 A man's goings are of Jehovah; How then can man understand his way?ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
25 It is a snare to a man rashly to say, `It is' holy, And after vows to make inquiry.వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు టయు ఒకనికి ఉరియగును.
26 A wise king winnoweth the wicked, And bringeth the `threshing' -wheel over them.జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.
27 The spirit of man is the lamp of Jehovah, Searching all his innermost parts.నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
28 Kindness and truth preserve the king; And his throne is upholden by kindness.కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.
29 The glory of young men is their strength; And the beauty of old men is the hoary head.¸°వనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము
30 Stripes that wound cleanse away evil; And strokes `reach' the innermost parts.గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం చును.
Telugu Bible