Proverbs 19 - YLT (Telugu)
1 Better `is' the poor walking in his integrity, Than the perverse `in' his lips, who `is' a fool.బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.
2 Also, without knowledge the soul `is' not good, And the hasty in feet is sinning.ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును
3 The folly of man perverteth his way, And against Jehovah is his heart wroth.అట్టివాడు హృదయమున యెహోవామీద కోపిం చును.
4 Wealth addeth many friends, And the poor from his neighbour is separated.ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.
5 A false witness is not acquitted, Whoso breatheth out lies is not delivered.కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
6 Many entreat the face of the noble, And all have made friendship to a man of gifts.అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.
7 All the brethren of the poor have hated him, Surely also his friends have been far from him, He is pursuing words -- they are not!బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.
8 Whoso is getting heart is loving his soul, He is keeping understanding to find good.బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉప కారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.
9 A false witness is not acquitted, And whoso breatheth out lies perisheth.కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
10 Luxury is not comely for a fool, Much less for a servant to rule among princes.భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
11 The wisdom of a man hath deferred his anger, And his glory `is' to pass over transgression.ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
12 The wrath of a king `is' a growl as of a young lion, And as dew on the herb his good-will.రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.
13 A calamity to his father `is' a foolish son, And the contentions of a wife `are' a continual dropping.బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటుతెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువు లతో సమానము.
14 House and wealth `are' the inheritance of fathers, And from Jehovah `is' an understanding wife.గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.
15 Sloth causeth deep sleep to fall, And an indolent soul doth hunger.సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.
16 Whoso is keeping the command is keeping his soul, Whoso is despising His ways dieth.ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును.
17 Whoso is lending `to' Jehovah is favouring the poor, And his deed He repayeth to him.బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
18 Chastise thy son, for there is hope, And to put him to death lift not up thy soul.బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
19 A man of great wrath is bearing punishment, For, if thou dost deliver, yet again thou dost add.మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.
20 Hear counsel and receive instruction, So that thou art wise in thy latter end.నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.
21 Many `are' the purposes in a man's heart, And the counsel of Jehovah it standeth.నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
22 The desirableness of a man `is' his kindness, And better `is' the poor than a liar.కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.
23 The fear of Jehovah `is' to life, And satisfied he remaineth -- he is not charged with evil.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.
24 The slothful hath hidden his hand in a dish, Even unto his mouth he bringeth it not back.సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
25 A scorner smite, and the simple acts prudently, And give reproof to the intelligent, He understandeth knowledge.అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందు దురు.
26 Whoso is spoiling a father causeth a mother to flee, A son causing shame, and bringing confusion.తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
27 Cease, my son, to hear instruction -- To err from sayings of knowledge.నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
28 A worthless witness scorneth judgment, And the mouth of the wicked swalloweth iniquity.వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.
29 Judgments have been prepared for scorners, And stripes for the back of fools!అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
Telugu Bible