Bible

Proverbs 19 - WEB (Telugu)

1 Better is the poor who walks in his integrity Than he who is perverse in his lips and is a fool.బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.

2 It isn't good to have zeal without knowledge; Nor being hasty with one's feet and missing the way.ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును

3 The foolishness of man subverts his way; His heart rages against Yahweh.అట్టివాడు హృదయమున యెహోవామీద కోపిం చును.

4 Wealth adds many friends, But the poor is separated from his friend.ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.

5 A false witness shall not be unpunished. He who pours out lies shall not go free.కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.

6 Many will entreat the favor of a ruler, And everyone is a friend to a man who gives gifts.అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.

7 All the relatives of the poor shun him: How much more do his friends avoid him! He pursues them with pleas, but they are gone.బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.

8 He who gets wisdom loves his own soul. He who keeps understanding shall find good.బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉప కారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.

9 A false witness shall not be unpunished. He who utters lies shall perish.కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.

10 Delicate living is not appropriate for a fool, Much less for a servant to have rule over princes.భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.

11 The discretion of a man makes him slow to anger. It is his glory to overlook an offense.ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

12 The king's wrath is like the roaring of a lion, But his favor is like dew on the grass.రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.

13 A foolish son is the calamity of his father. A wife's quarrels are a continual dripping.బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటుతెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువు లతో సమానము.

14 House and riches are an inheritance from fathers, But a prudent wife is from Yahweh.గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.

15 Slothfulness casts into a deep sleep. The idle soul shall suffer hunger.సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.

16 He who keeps the commandment keeps his soul, But he who is contemptuous in his ways shall die.ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును.

17 He who has pity on the poor lends to Yahweh; He will reward him.బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.

18 Discipline your son, for there is hope; Don't be a willing party to his death.బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.

19 A hot-tempered man must pay the penalty, For if you rescue him, you must do it again.మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.

20 Listen to counsel and receive instruction, That you may be wise in your latter end.నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.

21 There are many plans in a man's heart, But Yahweh's counsel will prevail.నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

22 That which makes a man to be desired is his kindness. A poor man is better than a liar.కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.

23 The fear of Yahweh leads to life, then contentment; He rests and will not be touched by trouble.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.

24 The sluggard buries his hand in the dish; He will not so much as bring it to his mouth again.సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.

25 Flog a scoffer, and the simple will learn prudence; Rebuke one who has understanding, and he will gain knowledge.అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందు దురు.

26 He who robs his father and drives away his mother, Is a son who causes shame and brings reproach.తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.

27 If you stop listening to instruction, my son, You will stray from the words of knowledge.నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.

28 A corrupt witness mocks justice, And the mouth of the wicked gulps down iniquity.వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.

29 Penalties are prepared for scoffers, And beatings for the backs of fools.అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.

Telugu Bible