Proverbs 18 - DBY (Telugu)
1 He that separateth himself seeketh [his] pleasure, he is vehement against all sound wisdom.వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
2 A fool hath no delight in understanding, but only that his heart may reveal itself.తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
3 When the wicked cometh, there cometh also contempt, and with ignominy reproach.భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును.
4 The words of a man's mouth are deep waters, [and] the fountain of wisdom is a gushing brook.మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.
5 It is not good to accept the person of the wicked, to wrong the righteous in judgment.తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.
6 A fool's lips enter into contention, and his mouth calleth for stripes.బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
7 A fool's mouth is destruction to him, and his lips are a snare to his soul.బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
8 The words of a talebearer are as dainty morsels, and they go down into the innermost parts of the belly.కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
9 He also who is indolent in his work is brother of the destroyer.పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.
10 The name of Jehovah is a strong tower: the righteous runneth into it, and is safe.యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
11 The rich man's wealth is his strong city, and as a high wall in his own imagination.ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
12 Before destruction the heart of man is haughty; and before honour [goeth] humility.ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
13 He that giveth answer before he heareth, it is folly and shame unto him.సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
14 The spirit of a man sustaineth his infirmity; but a broken spirit who can bear?నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
15 The heart of an intelligent [man] getteth knowledge, and the ear of the wise seeketh knowledge.జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
16 A man's gift maketh room for him, and bringeth him before great men.ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును
17 He that is first in his own cause [seemeth] just; but his neighbour cometh and searcheth him.వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.
18 The lot causeth contentions to cease, and parteth between the mighty.చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.
19 A brother offended is [harder to be won] than a strong city; and contentions are as the bars of a palace.బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశ పరచు కొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిర ములు.
20 A man's belly is satisfied with the fruit of his mouth; with the increase of his lips is he satisfied.ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.
21 Death and life are in the power of the tongue, and they that love it shall eat the fruit thereof.జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
22 Whoso hath found a wife hath found a good thing, and hath obtained favour from Jehovah.భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.
23 He that is poor speaketh with supplications, but the rich answereth roughly.దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
24 A man of [many] friends will come to ruin but there is a friend [that] sticketh closer than a brother.బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.
Telugu Bible