Proverbs 18 - BBE (Telugu)
1 He who keeps himself separate for his private purpose goes against all good sense.వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
2 A foolish man has no pleasure in good sense, but only to let what is in his heart come to light.తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
3 When the evil-doer comes, a low opinion comes with him, and with the loss of honour comes shame.భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును.
4 The words of a man's mouth are like deep waters: the fountain of wisdom is like a flowing stream.మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.
5 To have respect for the person of the evil-doer is not good, or to give a wrong decision against the upright.తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.
6 A foolish man's lips are a cause of fighting, and his mouth makes him open to blows.బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
7 The mouth of a foolish man is his destruction, and his lips are a net for his soul.బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
8 The words of one who says evil of his neighbour secretly are like sweet food, and go down into the inner parts of the stomach.కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
9 He who does not give his mind to his work is brother to him who makes destruction.పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.
10 The name of the Lord is a strong tower: the upright man running into it is safe.యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
11 The property of a man of wealth is his strong town, and it is as a high wall in the thoughts of his heart.ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
12 Before destruction the heart of man is full of pride, and before honour goes a gentle spirit.ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
13 To give an answer before hearing is a foolish thing and a cause of shame.సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
14 The spirit of a man will be his support when he is ill; but how may a broken spirit be lifted up?నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
15 The heart of the man of good sense gets knowledge; the ear of the wise is searching for knowledge.జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
16 A man's offering makes room for him, letting him come before great men.ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును
17 The man who first puts his cause before the judge seems to be in the right; but then his neighbour comes and puts his cause in its true light.వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.
18 The decision of chance puts an end to argument, parting the strong.చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.
19 A brother wounded is like a strong town, and violent acts are like a locked tower.బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశ పరచు కొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిర ములు.
20 With the fruit of a man's mouth his stomach will be full; the produce of his lips will be his in full measure.ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.
21 Death and life are in the power of the tongue; and those to whom it is dear will have its fruit for their food.జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
22 Whoever gets a wife gets a good thing, and has the approval of the Lord.భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.
23 The poor man makes requests for grace, but the man of wealth gives a rough answer.దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
24 There are friends who may be a man's destruction, but there is a lover who keeps nearer than a brother.బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.
Telugu Bible