Proverbs 16 - BBE (Telugu)
1 The designs of the heart are man's, but the answer of the tongue comes from the Lord.హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
2 All a man's ways are clean to himself; but the Lord puts men's spirits into his scales.ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
3 Put your works into the hands of the Lord, and your purposes will be made certain.నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
4 The Lord has made everything for his purpose, even the sinner for the day of evil.యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
5 Everyone who has pride in his heart is disgusting to the Lord: he will certainly not go free from punishment.గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
6 By mercy and good faith evil-doing is taken away: and by the fear of the Lord men are turned away from evil.కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
7 When a man's ways are pleasing to the Lord, he makes even his haters be at peace with him.ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
8 Better is a little with righteousness, than great wealth with wrongdoing.అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
9 A man may make designs for his way, but the Lord is the guide of his steps.ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
10 Decision is in the lips of the king: his mouth will not go wrong in judging.దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు.
11 True measures and scales are the Lord's: all the weights of the bag are his work.న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
12 Evil-doing is disgusting to kings: for the seat of the ruler is based on righteousness.రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
13 Lips of righteousness are the delight of kings; and he who says what is upright is dear to him.నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.
14 The wrath of the king is like those who give news of death, but a wise man will put peace in place of it.రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.
15 In the light of the king's face there is life; and his approval is like a cloud of spring rain.రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.
16 How much better it is to get wisdom than gold! and to get knowledge is more to be desired than silver.అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
17 The highway of the upright is to be turned away from evil: he who takes care of his way will keep his soul.చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.
18 Pride goes before destruction, and a stiff spirit before a fall.నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
19 Better it is to have a gentle spirit with the poor, than to take part in the rewards of war with men of pride.గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.
20 He who gives attention to the law of right will get good; and whoever puts his faith in the Lord is happy.ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
21 The wise-hearted will be named men of good sense: and by pleasing words learning is increased.జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
22 Wisdom is a fountain of life to him who has it; but the punishment of the foolish is their foolish behaviour.తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
23 The heart of the wise man is the teacher of his mouth, and gives increased learning to his lips.జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
24 Pleasing words are like honey, sweet to the soul and new life to the bones.ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
25 There is a way which seems straight before a man, but its end is the ways of death.ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
26 The desire of the working man is working for him, for his need of food is driving him on.కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.
27 A good-for-nothing man is a designer of evil, and in his lips there is a burning fire.పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
28 A man of twisted purposes is a cause of fighting everywhere: and he who says evil secretly makes trouble between friends.మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
29 A violent man puts desire of evil into his neighbour's mind, and makes him go in a way which is not good.బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.
30 He whose eyes are shut is a man of twisted purposes, and he who keeps his lips shut tight makes evil come about.కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.
31 The grey head is a crown of glory, if it is seen in the way of righteousness.నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.
32 He who is slow to be angry is better than a man of war, and he who has control over his spirit than he who takes a town.పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
33 A thing may be put to the decision of chance, but it comes about through the Lord.చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.
Telugu Bible