Bible

Proverbs 11 - YLT (Telugu)

1 Balances of deceit `are' an abomination to Jehovah, And a perfect weight `is' His delight.దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.

2 Pride hath come, and shame cometh, And with the lowly `is' wisdom.అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3 The integrity of the upright leadeth them, And the perverseness of the treacherous destroyeth them.యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

4 Wealth profiteth not in a day of wrath, And righteousness delivereth from death.ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.

5 The righteousness of the perfect maketh right his way, And by his wickedness doth the wicked fall.యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6 The righteousness of the upright delivereth them, And in mischief the treacherous are captured.యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

7 In the death of a wicked man, hope perisheth, And the expectation of the iniquitous hath been lost.భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

8 The righteous from distress is drawn out, And the wicked goeth in instead of him.నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును

9 With the mouth a hypocrite corrupteth his friend, And by knowledge the righteous are drawn out.భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

10 In the good of the righteous a city exulteth, And in the destruction of the wicked `is' singing.నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11 By the blessing of the upright is a city exalted, And by the mouth of the wicked thrown down.యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12 Whoso is despising his neighbour lacketh heart, And a man of understanding keepeth silence.తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

13 A busybody is revealing secret counsel, And the faithful of spirit is covering the matter.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14 Without counsels do a people fall, And deliverance `is' in a multitude of counsellors.నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15 Evil `one' suffereth when he hath been surety `for' a stranger, And whoso is hating suretyship is confident.ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16 A gracious woman retaineth honour, And terrible `men' retain riches.నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

17 A kind man is rewarding his own soul, And the fierce is troubling his own flesh.దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18 The wicked is getting a lying wage, And whoso is sowing righteousness -- a true reward.భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19 Rightly `is' righteousness for life, And whoso is pursuing evil -- for his own death.యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును

20 An abomination to Jehovah `are' the perverse of heart, And the perfect of the way `are' His delight.మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

21 Hand to hand, the wicked is not acquitted, And the seed of the righteous hath escaped.నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22 A ring of gold in the nose of a sow -- A fair woman and stubborn of behaviour.వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23 The desire of the righteous `is' only good, The hope of the wicked `is' transgression.నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

24 There is who is scattering, and yet is increased, And who is keeping back from uprightness, only to want.వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

25 A liberal soul is made fat, And whoso is watering, he also is watered.ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26 Whoso is withholding corn, the people execrate him, And a blessing `is' for the head of him who is selling.ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27 Whoso is earnestly seeking good Seeketh a pleasing thing, And whoso is seeking evil -- it meeteth him.మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28 Whoso is confident in his wealth he falleth, And as a leaf, the righteous flourish.ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29 Whoso is troubling his own house inheriteth wind, And a servant `is' the fool to the wise of heart.తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30 The fruit of the righteous `is' a tree of life, And whoso is taking souls `is' wise.నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

31 Lo, the righteous in the earth is recompensed, Surely also the wicked and the sinner!నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?

Telugu Bible