Bible

Proverbs 11 - WEB (Telugu)

1 A false balance is an abomination to Yahweh, But accurate weights are his delight.దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.

2 When pride comes, then comes shame, But with humility comes wisdom.అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3 The integrity of the upright shall guide them, But the perverseness of the treacherous shall destroy them.యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

4 Riches don't profit in the day of wrath, But righteousness delivers from death.ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.

5 The righteousness of the blameless will direct his way, But the wicked shall fall by his own wickedness.యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6 The righteousness of the upright shall deliver them, But the unfaithful will be trapped by evil desires.యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

7 When a wicked man dies, hope perishes, And expectation of power comes to nothing.భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

8 A righteous person is delivered out of trouble, And the wicked takes his place.నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును

9 With his mouth the godless man destroys his neighbor, But the righteous will be delivered through knowledge.భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

10 When it goes well with the righteous, the city rejoices. When the wicked perish, there is shouting.నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11 By the blessing of the upright, the city is exalted, But it is overthrown by the mouth of the wicked.యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12 One who despises his neighbor is void of wisdom, But a man of understanding holds his peace.తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

13 One who brings gossip betrays a confidence, But one who is of a trustworthy spirit is one who keeps a secret.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14 Where there is no wise guidance, the nation falls, But in the multitude of counselors there is victory.నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15 He who is collateral for a stranger will suffer for it, But he who refuses pledges of collateral is secure.ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16 A gracious woman obtains honor, But violent men obtain riches.నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

17 The merciful man does good to his own soul, But he who is cruel troubles his own flesh.దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18 Wicked people earn deceitful wages, But one who sows righteousness reaps a sure reward.భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19 He who is truly righteous gets life. He who pursues evil gets death.యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును

20 Those who are perverse in heart are an abomination to Yahweh, But those whose ways are blameless are his delight.మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

21 Most assuredly, the evil man will not be unpunished, But the seed of the righteous will be delivered.నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22 Like a gold ring in a pig's snout, Is a beautiful woman who lacks discretion.వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23 The desire of the righteous is only good. The expectation of the wicked is wrath.నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

24 There is one who scatters, and increases yet more. There is one who withholds more than is appropriate, but gains poverty.వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

25 The liberal soul shall be made fat. He who waters shall be watered also himself.ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26 People curse someone who withholds grain, But blessing will be on the head of him who sells it.ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27 He who diligently seeks good seeks favor, But he who searches after evil, it shall come to him.మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28 He who trusts in his riches will fall, But the righteous shall flourish as the green leaf.ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29 He who troubles his own house shall inherit the wind. The foolish shall be servant to the wise of heart.తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30 The fruit of the righteous is a tree of life. He who is wise wins souls.నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

31 Behold, the righteous shall be repaid in the earth; How much more the wicked and the sinner!నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?

Telugu Bible