Bible

Proverbs 11 - KJV (Telugu)

1 A false balance is abomination to the LORD: but a just weight is his delight.దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.

2 When pride cometh, then cometh shame: but with the lowly is wisdom.అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3 The integrity of the upright shall guide them: but the perverseness of transgressors shall destroy them.యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

4 Riches profit not in the day of wrath: but righteousness delivereth from death.ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.

5 The righteousness of the perfect shall direct his way: but the wicked shall fall by his own wickedness.యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6 The righteousness of the upright shall deliver them: but transgressors shall be taken in their own naughtiness.యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

7 When a wicked man dieth, his expectation shall perish: and the hope of unjust men perisheth.భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

8 The righteous is delivered out of trouble, and the wicked cometh in his stead.నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును

9 An hypocrite with his mouth destroyeth his neighbour: but through knowledge shall the just be delivered.భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

10 When it goeth well with the righteous, the city rejoiceth: and when the wicked perish, there is shouting.నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11 By the blessing of the upright the city is exalted: but it is overthrown by the mouth of the wicked.యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12 He that is void of wisdom despiseth his neighbour: but a man of understanding holdeth his peace.తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

13 A talebearer revealeth secrets: but he that is of a faithful spirit concealeth the matter.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14 Where no counsel is, the people fall: but in the multitude of counsellors there is safety.నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15 He that is surety for a stranger shall smart for it: and he that hateth suretiship is sure.ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16 A gracious woman retaineth honour: and strong men retain riches.నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

17 The merciful man doeth good to his own soul: but he that is cruel troubleth his own flesh.దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18 The wicked worketh a deceitful work: but to him that soweth righteousness shall be a sure reward.భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19 As righteousness tendeth to life: so he that pursueth evil pursueth it to his own death.యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును

20 They that are of a froward heart are abomination to the LORD: but such as are upright in their way are his delight.మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

21 Though hand join in hand, the wicked shall not be unpunished: but the seed of the righteous shall be delivered.నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22 As a jewel of gold in a swine's snout, so is a fair woman which is without discretion.వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23 The desire of the righteous is only good: but the expectation of the wicked is wrath.నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

24 There is that scattereth, and yet increaseth; and there is that withholdeth more than is meet, but it tendeth to poverty.వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

25 The liberal soul shall be made fat: and he that watereth shall be watered also himself.ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26 He that withholdeth corn, the people shall curse him: but blessing shall be upon the head of him that selleth it.ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27 He that diligently seeketh good procureth favour: but he that seeketh mischief, it shall come unto him.మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28 He that trusteth in his riches shall fall; but the righteous shall flourish as a branch.ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29 He that troubleth his own house shall inherit the wind: and the fool shall be servant to the wise of heart.తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30 The fruit of the righteous is a tree of life; and he that winneth souls is wise.నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

31 Behold, the righteous shall be recompensed in the earth: much more the wicked and the sinner.నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?

Telugu Bible