Bible

Proverbs 11 - DBY (Telugu)

1 A false balance is an abomination to Jehovah; but a just weight is his delight.దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.

2 [When] pride cometh, then cometh shame; but with the lowly is wisdom.అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3 The integrity of the upright guideth them; but the crookedness of the unfaithful destroyeth them.యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

4 Wealth profiteth not in the day of wrath; but righteousness delivereth from death.ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.

5 The righteousness of the perfect maketh plain his way; but the wicked falleth by his own wickedness.యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6 The righteousness of the upright delivereth them; but the treacherous are taken in their own craving.యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

7 When a wicked man dieth, [his] expectation shall perish; and the hope of evil [men] perisheth.భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

8 The righteous is delivered out of trouble, and the wicked cometh in his stead.నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును

9 With his mouth a hypocrite destroyeth his neighbour; but through knowledge are the righteous delivered.భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

10 When it goeth well with the righteous, the city rejoiceth; and when the wicked perish, there is shouting.నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11 By the blessing of the upright the city is exalted; but it is overthrown by the mouth of the wicked.యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12 He that despiseth his neighbour is void of heart; but a man of understanding holdeth his peace.తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

13 He that goeth about talebearing revealeth secrets; but he that is of a faithful spirit concealeth the matter.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14 Where no advice is, the people fall; but in the multitude of counsellors there is safety.నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15 It goeth ill with him that is surety for another; but he that hateth suretyship is secure.ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16 A gracious woman retaineth honour; and the violent retain riches.నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

17 The merciful man doeth good to his own soul; but the cruel troubleth his own flesh.దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18 The wicked worketh a deceitful work; but he that soweth righteousness hath a sure reward.భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19 As righteousness [tendeth] to life, so he that pursueth evil [doeth it] to his own death.యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును

20 The perverse in heart are abomination to Jehovah; but they that are perfect in [their] way are his delight.మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

21 Hand for hand! an evil [man] shall not be held innocent; but the seed of the righteous shall be delivered.నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22 A fair woman who is without discretion, is [as] a gold ring in a swine's snout.వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23 The desire of the righteous is only good; the expectation of the wicked is wrath.నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

24 There is that scattereth, and yet increaseth; and there is that withholdeth more than is right, but [it tendeth] only to want.వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

25 The liberal soul shall be made fat, and he that watereth shall be watered also himself.ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26 He that withholdeth corn, the people curse him; but blessing shall be upon the head of him that selleth it.ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27 He that is earnest after good seeketh favour; but he that searcheth for mischief, it shall come upon him.మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28 He that trusteth in his riches shall fall; but the righteous shall flourish as a leaf.ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29 He that troubleth his own house shall inherit wind; and the fool shall be servant to the wise of heart.తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30 The fruit of the righteous is a tree of life; and the wise winneth souls.నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

31 Behold, the righteous shall be requited on the earth: how much more the wicked and the sinner.నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?

Telugu Bible