Proverbs 11 - BBE (Telugu)
1 Scales of deceit are hated by the Lord, but a true weight is his delight.దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
2 When pride comes, there comes shame, but wisdom is with the quiet in spirit.అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
3 The righteousness of the upright will be their guide, but the twisted ways of the false will be their destruction.యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.
4 Wealth is of no profit in the day of wrath, but righteousness keeps a man safe from death.ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.
5 The righteousness of the good man will make his way straight, but the sin of the evil-doer will be the cause of his fall.యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
6 The righteousness of the upright will be their salvation, but the false will themselves be taken in their evil designs.యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.
7 At the death of an upright man his hope does not come to an end, but the hope of the evil-doer comes to destruction.భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.
8 The upright man is taken out of trouble, and in his place comes the sinner.నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును
9 With his mouth the evil man sends destruction on his neighbour; but through knowledge the upright are taken out of trouble.భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
10 When things go well for the upright man, all the town is glad; at the death of sinners, there are cries of joy.నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
11 By the blessing of the upright man the town is made great, but it is overturned by the mouth of the evil-doer.యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.
12 He who has a poor opinion of his neighbour has no sense, but a wise man keeps quiet.తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
13 He who goes about talking of others makes secrets public, but the true-hearted man keeps things covered.కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.
14 When there is no helping suggestion the people will have a fall, but with a number of wise guides they will be safe.నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
15 He who makes himself responsible for a strange man will undergo much loss; but the hater of such undertakings will be safe.ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
16 A woman who is full of grace is honoured, but a woman hating righteousness is a seat of shame: those hating work will undergo loss, but the strong keep their wealth.నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.
17 The man who has mercy will be rewarded, but the cruel man is the cause of trouble to himself.దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును
18 The sinner gets the payment of deceit; but his reward is certain who puts in the seed of righteousness.భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
19 So righteousness gives life; but he who goes after evil gets death for himself.యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును
20 The uncontrolled are hated by the Lord, but those whose ways are without error are his delightమూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.
21 Certainly the evil-doer will not go free from punishment, but the seed of the upright man will be safe.నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.
22 Like a ring of gold in the nose of a pig, is a beautiful woman who has no sense.వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.
23 The desire of the upright man is only for good, but wrath is waiting for the evil-doer.నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.
24 A man may give freely, and still his wealth will be increased; and another may keep back more than is right, but only comes to be in need.వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
25 He who gives blessing will be made fat, but the curser will himself be cursed.ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును
26 He who keeps back grain will be cursed by the people; but a blessing will be on the head of him who lets them have it for a price.ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.
27 He who, with all his heart, goes after what is good is searching for grace; but he who is looking for trouble will get it.మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.
28 He who puts his faith in wealth will come to nothing; but the upright man will be full of growth like the green leaf.ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
29 The troubler of his house will have the wind for his heritage, and the foolish will be servant to the wise-hearted.తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.
30 The fruit of righteousness is a tree of life, but violent behaviour takes away souls.నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు
31 If the upright man is rewarded on earth, how much more the evil-doer and the sinner!నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?
Telugu Bible