Bible

Proverbs 10 - WEB (Telugu)

1 The proverbs of Solomon. A wise son makes a glad father; But a foolish son brings grief to his mother.జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.

2 Treasures of wickedness profit nothing, But righteousness delivers from death.భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.

3 Yahweh will not allow the soul of the righteous to go hungry, But he thrusts away the desire of the wicked.యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.

4 He becomes poor who works with a lazy hand, But the hand of the diligent brings wealth.బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.

5 He who gathers in summer is a wise son, But he who sleeps during the harvest is a son who causes shame.వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమా రుడు.

6 Blessings are on the head of the righteous, But violence covers the mouth of the wicked.నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.

7 The memory of the righteous is blessed, But the name of the wicked will rot.నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును

8 The wise in heart accept commandments, But a chattering fool will fall.జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును.

9 He who walks blamelessly walks surely, But he who perverts his ways will be found out.యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవ ర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.

10 One winking with the eye causes sorrow, But a chattering fool will fall.కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును.

11 The mouth of the righteous is a spring of life, But violence covers the mouth of the wicked.నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.

12 Hatred stirs up strife, But love covers all wrongs.పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.

13 Wisdom is found on the lips of him who has discernment, But a rod is for the back of him who is void of understanding.వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.

14 Wise men lay up knowledge, But the mouth of the foolish is near ruin.జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.

15 The rich man's wealth is his strong city. The destruction of the poor is their poverty.ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.

16 The labor of the righteous leads to life. The increase of the wicked leads to sin.నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.

17 He is in the way of life who heeds correction, But he who forsakes reproof leads others astray.ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.

18 He who hides hatred has lying lips. He who utters a slander is a fool.అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.

19 In the multitude of words there is no lack of disobedience, But he who restrains his lips does wisely.విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

20 The tongue of the righteous is like choice silver. The heart of the wicked is of little worth.నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.

21 The lips of the righteous feed many, But the foolish die for lack of understanding.నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.

22 Yahweh's blessing brings wealth, And he adds no trouble to it.యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

23 It is a fool's pleasure to do wickedness, But wisdom is a man of understanding's pleasure.చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.

24 What the wicked fear, will overtake them, But the desire of the righteous will be granted.భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.

25 When the whirlwind passes, the wicked is no more; But the righteous stand firm forever.సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.

26 As vinegar to the teeth, and as smoke to the eyes, So is the sluggard to those who send him.సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.

27 The fear of Yahweh prolongs days, But the years of the wicked shall be shortened.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.

28 The prospect of the righteous is joy, But the hope of the wicked will perish.నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.

29 The way of Yahweh is a stronghold to the upright, But it is a destruction to the workers of iniquity.యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము పాపముచేయువారికి అది నాశనకరము.

30 The righteous will never be removed, But the wicked will not dwell in the land.నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు.

31 The mouth of the righteous brings forth wisdom, But the perverse tongue will be cut off.నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.

32 The lips of the righteous know what is acceptable, But the mouth of the wicked is perverse.నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.

Telugu Bible