Bible

Numbers 33 - WEB (Telugu)

1 These are the journeys of the children of Israel, when they went forth out of the land of Egypt by their hosts under the hand of Moses and Aaron.మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.

2 Moses wrote their goings out according to their journeys by the commandment of Yahweh: and these are their journeys according to their goings out.మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.

3 They traveled from Rameses in the first month, on the fifteenth day of the first month; on the next day after the Passover the children of Israel went out with a high hand in the sight of all the Egyptians,​మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.

4 while the Egyptians were burying all their firstborn, whom Yahweh had struck among them: on their gods also Yahweh executed judgments.​అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.

5 The children of Israel traveled from Rameses, and encamped in Succoth.​ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.

6 They traveled from Succoth, and encamped in Etham, which is in the edge of the wilderness.సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.

7 They traveled from Etham, and turned back to Pihahiroth, which is before Baal Zephon: and they encamped before Migdol.ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.

8 They traveled from before Hahiroth, and passed through the midst of the sea into the wilderness: and they went three days' journey in the wilderness of Etham, and encamped in Marah.పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.

9 They traveled from Marah, and came to Elim: and in Elim were twelve springs of water, and seventy palm trees; and they encamped there.​ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.

10 They traveled from Elim, and encamped by the Red Sea.​ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.

11 They traveled from the Red Sea, and encamped in the wilderness of Sin.ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

12 They traveled from the wilderness of Sin, and encamped in Dophkah.సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి

13 They traveled from Dophkah, and encamped in Alush.దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

14 They traveled from Alush, and encamped in Rephidim, where was no water for the people to drink.ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.

15 They traveled from Rephidim, and encamped in the wilderness of Sinai.​రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.

16 They traveled from the wilderness of Sinai, and encamped in Kibroth-hattaavah.సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.

17 They traveled from Kibroth-hattaavah, and encamped in Hazeroth.కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

18 They traveled from Hazeroth, and encamped in Rithmah.హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.

19 They traveled from Rithmah, and encamped in Rimmon Perez.​రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.

20 They traveled from Rimmon Perez, and encamped in Libnah.రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.

21 They traveled from Libnah, and encamped in Rissah.లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.

22 They traveled from Rissah, and encamped in Kehelathah.​రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.

23 They traveled from Kehelathah, and encamped in Mount Shepher.​కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

24 They traveled from Mount Shepher, and encamped in Haradah.​​షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.

25 They traveled from Haradah, and encamped in Makheloth.​హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

26 They traveled from Makheloth, and encamped in Tahath.​మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.

27 They traveled from Tahath, and encamped in Terah.తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

28 They traveled from Terah, and encamped in Mithkah.తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

29 They traveled from Mithkah, and encamped in Hashmonah.మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

30 They traveled from Hashmonah, and encamped in Moseroth.​హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

31 They traveled from Moseroth, and encamped in Bene Jaakan.​మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

32 They traveled from Bene Jaakan, and encamped in Hor Haggidgad.బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

33 They traveled from Hor Haggidgad, and encamped in Jotbathah.​హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

34 They traveled from Jotbathah, and encamped in Abronah.యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.

35 They traveled from Abronah, and encamped in Ezion Geber.ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

36 They traveled from Ezion Geber, and encamped in the wilderness of Zin (the same is Kadesh).ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.

37 They traveled from Kadesh, and encamped in Mount Hor, in the edge of the land of Edom.కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.

38 Aaron the priest went up into Mount Hor at the commandment of Yahweh, and died there, in the fortieth year after the children of Israel were come out of the land of Egypt, in the fifth month, on the first day of the month.​యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

39 Aaron was one hundred twenty-three years old when he died in Mount Hor.అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.

40 The Canaanite, the king of Arad, who lived in the South in the land of Canaan, heard of the coming of the children of Israel.అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.

41 They traveled from Mount Hor, and encamped in Zalmonah.వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

42 They traveled from Zalmonah, and encamped in Punon.​సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.

43 They traveled from Punon, and encamped in Oboth.పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

44 They traveled from Oboth, and encamped in Iye-abarim, in the border of Moab.​ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

45 They traveled from Iyim, and encamped in Dibon-gad.ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.

46 They traveled from Dibon-gad, and encamped in Almon Diblathaim.దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.

47 They traveled from Almon Diblathaim, and encamped in the mountains of Abarim, before Nebo.అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.

48 They traveled from the mountains of Abarim, and encamped in the plains of Moab by the Jordan at Jericho.అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.

49 They encamped by the Jordan, from Beth-jeshimoth even to Abel Shittim in the plains of Moab.వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.

50 Yahweh spoke to Moses in the plains of Moab by the Jordan at Jericho, saying,యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

51 Speak to the children of Israel, and tell them, When you pass over the Jordan into the land of Canaan,నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత

52 then you shall drive out all the inhabitants of the land from before you, and destroy all their figured [stones], and destroy all their molten images, and demolish all their high places:ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి

53 and you shall take possession of the land, and dwell therein; for to you have I given the land to possess it.​ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.

54 You shall inherit the land by lot according to your families; to the more you shall give the more inheritance, and to the fewer you shall give the less inheritance: wherever the lot falls to any man, that shall be his; according to the tribes of your fathers shall you inherit.మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

55 But if you will not drive out the inhabitants of the land from before you, then shall those who you let remain of them be as pricks in your eyes, and as thorns in your sides, and they shall vex you in the land in which you dwell.అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.

56 It shall happen that as I thought to do to them, so will I do to you.మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

Telugu Bible