Numbers 18 - WEB (Telugu)
1 Yahweh said to Aaron, You and your sons and your fathers' house with you shall bear the iniquity of the sanctuary; and you and your sons with you shall bear the iniquity of your priesthood.యెహోవా అహరోనుతో ఇట్లనెనునీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు
2 Your brothers also, the tribe of Levi, the tribe of your father, bring you near with you, that they may be joined to you, and minister to you: but you and your sons with you shall be before the tent of the testimony.మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను
3 They shall keep your charge, and the charge of all the Tent: only they shall not come near to the vessels of the sanctuary and to the altar, that they not die, neither they, nor you.వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండ వలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.
4 They shall be joined to you, and keep the charge of the tent of meeting, for all the service of the Tent: and a stranger shall not come near to you.వారు నీతో కలిసి ప్రత్య క్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.
5 You shall keep the charge of the sanctuary, and the charge of the altar; that there be wrath no more on the children of Israel.అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడ వలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.
6 I, behold, I have taken your brothers the Levites from among the children of Israel: to you they are a gift, given to Yahweh, to do the service of the tent of meeting.ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయు లైన మీ సహోద రులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు.
7 You and your sons with you shall keep your priesthood for everything of the altar, and for that within the veil; and you shall serve: I give you the priesthood as a service of gift: and the stranger who comes near shall be put to death.కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.
8 Yahweh spoke to Aaron, I, behold, I have given you the charge of my heave-offerings, even all the holy things of the children of Israel; to you have I given them by reason of the anointing, and to your sons, as a portion forever.మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.
9 This shall be your of the most holy things, [reserved] from the fire: every offering of theirs, even every meal-offering of theirs, and every sin-offering of theirs, and every trespass-offering of theirs, which they shall render to me, shall be most holy for you and for your sons.అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.
10 As the most holy things shall you eat of it; every male shall eat of it: it shall be holy to you.ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.
11 This is your: the heave-offering of their gift, even all the wave-offerings of the children of Israel; I have given them to you, and to your sons and to your daughters with you, as a portion forever; everyone who is clean in your house shall eat of it.మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.
12 All the best of the oil, and all the best of the vintage, and of the grain, the first fruits of them which they give to Yahweh, to you have I given them.వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.
13 The first-ripe fruits of all that is in their land, which they bring to Yahweh, shall be yours; everyone who is clean in your house shall eat of it.వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును.
14 Everything devoted in Israel shall be yours.ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.
15 Everything that opens the womb, of all flesh which they offer to Yahweh, both of man and animal shall be yours: nevertheless the firstborn of man shall you surely redeem, and the firstborn of unclean animals shall you redeem.మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.
16 Those who are to be redeemed of them from a month old shall you redeem, according to your estimation, for the money of five shekels, after the shekel of the sanctuary (the same is twenty gerahs).అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.
17 But the firstborn of a cow, or the firstborn of a sheep, or the firstborn of a goat, you shall not redeem; they are holy: you shall sprinkle their blood on the altar, and shall burn their fat for an offering made by fire, for a sweet savor to Yahweh.అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠిత మైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును.
18 The flesh of them shall be your, as the wave-breast and as the right thigh, it shall be yours.అల్లాండిపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును.
19 All the heave-offerings of the holy things, which the children of Israel offer to Yahweh, have I given you, and your sons and your daughters with you, as a portion forever: it is a covenant of salt forever before Yahweh to you and to your seed with you.ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమా ర్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్ని ధిని నిత్యమును స్థిరమైన నిబంధన.
20 Yahweh said to Aaron, You shall have no inheritance in their land, neither shall you have any portion among them: I am your portion and your inheritance among the children of Israel.మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనువారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
21 To the children of Levi, behold, I have given all the tithe in Israel for an inheritance, in return for their service which they serve, even the service of the tent of meeting.ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.
22 Henceforth the children of Israel shall not come near the tent of meeting, lest they bear sin, and die.ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.
23 But the Levites shall do the service of the tent of meeting, and they shall bear their iniquity: it shall be a statute forever throughout your generations; and among the children of Israel they shall have no inheritance.అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
24 For the tithe of the children of Israel, which they offer as a heave-offering to Yahweh, I have given to the Levites for an inheritance: therefore I have said to them, Among the children of Israel they shall have no inheritance.అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి ష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయు లకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రా యేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.
25 Yahweh spoke to Moses, saying,మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
26 Moreover you shall speak to the Levites, and tell them, When you take of the children of Israel the tithe which I have given you from them for your inheritance, then you shall offer up a heave-offering of it for Yahweh, a tithe of the tithe.నీవు లేవీయులతో ఇట్లనుమునేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.
27 Your heave-offering shall be reckoned to you, as though it were the grain of the threshing floor, and as the fullness of the winepress.మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.
28 Thus you also shall offer a heave-offering to Yahweh of all your tithes, which you receive of the children of Israel; and of it you shall give Yahweh's heave-offering to Aaron the priest.అట్లు మీరు ఇశ్రాయేలీ యులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింప వలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజ కుడైన అహరోనుకు ఇయ్యవలెను.
29 Out of all your gifts you shall offer every heave-offering of Yahweh, of all the best of it, even the holy part of it out of it.మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.
30 Therefore you shall tell them, When you heave the best of it from it, then it shall be reckoned to the Levites as the increase of the threshing floor, and as the increase of the wine-press.మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగ మును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.
31 You shall eat it in every place, you and your households: for it is your reward in return for your service in the tent of meeting.మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.
32 You shall bear no sin by reason of it, when you have heaved from it the best of it: and you shall not profane the holy things of the children of Israel, that you not die.మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాప శిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీ యుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.
Telugu Bible