Bible

Numbers 1 - WEB (Telugu)

1 Yahweh spoke to Moses in the wilderness of Sinai, in the Tent of Meeting, on the first day of the second month, in the second year after they had come out of the land of Egypt, saying,వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను

2 "Take a census of all the congregation of the children of Israel, by their families, by their fathers' houses, according to the number of the names, every male, one by one;ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయిం చుము.

3 from twenty years old and upward, all who are able to go out to war in Israel. You and Aaron shall number them by their divisions.ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.

4 With you there shall be a man of every tribe; everyone head of his fathers' house.మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.

5 These are the names of the men who shall stand with you: Of Reuben: Elizur the son of Shedeur.మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగారూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;

6 Of Simeon: Shelumiel the son of Zurishaddai.షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు

7 Of Judah: Nahshon the son of Amminadab.యూదా గోత్రములో అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను

8 Of Issachar: Nethanel the son of Zuar.ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైననెత నేలు

9 Of Zebulun: Eliab the son of Helon.​జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

10 Of the children of Joseph: Of Ephraim: Elishama the son of Ammihud. Of Manasseh: Gamaliel the son of Pedahzur.యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు

11 Of Benjamin: Abidan the son of Gideoni.బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

12 Of Dan: Ahiezer the son of Ammishaddai.దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు

13 Of Asher: Pagiel the son of Ochran.ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు

14 Of Gad: Eliasaph the son of Deuel.గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు

15 Of Naphtali: Ahira the son of Enan."నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.

16 These are those who were called of the congregation, the princes of the tribes of their fathers; they were the heads of the thousands of Israel.వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.

17 Moses and Aaron took these men who are mentioned by name.పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహ రోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను.

18 They assembled all the congregation together on the first day of the second month; and they declared their ancestry by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, one by one.​ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబ ములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా

19 As Yahweh commanded Moses, so he numbered them in the wilderness of Sinai.​యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.

20 The children of Reuben, Israel's firstborn, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, one by one, every male from twenty years old and upward, all who were able to go out to war;​ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.

21 those who were numbered of them, of the tribe of Reuben, were forty-six thousand five hundred.​షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు

22 Of the children of Simeon, their generations, by their families, by their fathers' houses, those who were numbered of it, according to the number of the names, one by one, every male from twenty years old and upward, all who were able to go out to war;​మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా

23 those who were numbered of them, of the tribe of Simeon, were fifty-nine thousand three hundred.షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమి్మదివేల మూడు వందలమంది యైరి.

24 Of the children of Gad, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

25 those who were numbered of them, of the tribe of Gad, were forty-five thousand six hundred fifty.గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.

26 Of the children of Judah, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

27 those who were numbered of them, of the tribe of Judah, were sixty-four thousand six hundred.యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.

28 Of the children of Issachar, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశ ము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

29 those who were numbered of them, of the tribe of Issachar, were fifty-four thousand four hundred.ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మంది యైరి.

30 Of the children of Zebulun, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

31 those who were numbered of them, of the tribe of Zebulun, were fifty-seven thousand four hundred.జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.

32 Of the children of Joseph, of the children of Ephraim, their generations, by thir families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా

33 those who were numbered of them, of the tribe of Ephraim, were forty thousand five hundred.​యోసేపు గోత్ర ములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి.

34 Of the children of Manasseh, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;​మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

35 those who were numbered of them, of the tribe of Manasseh, were thirty-two thousand two hundred.​​మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.

36 Of the children of Benjamin, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go out to war;బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

37 those who were numbered of them, of the tribe of Benjamin, were thirty-five thousand four hundred.బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.

38 Of the children of Dan, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go forth to war;దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా

39 those who were numbered of them, of the tribe of Dan, were sixty-two thousand seven hundred.దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.

40 Of the children of Asher, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go forth to war;ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

41 those who were numbered of them, of the tribe of Asher, were forty-one thousand five hundred.ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.

42 Of the children of Naphtali, their generations, by their families, by their fathers' houses, according to the number of the names, from twenty years old and upward, all who were able to go forth to war;నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

43 those who were numbered of them, of the tribe of Naphtali, were fifty-three thousand four hundred.నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.

44 These are those who were numbered, whom Moses and Aaron numbered, and the princes of Israel, being twelve men: they were each one for his fathers' house.వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహ రోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్క డుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు.'

45 So all those who were numbered of the children of Israel by their fathers' houses, from twenty years old and upward, all who were able to go out to war in Israel;అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు

46 even all those who were numbered were six hundred three thousand five hundred fifty.​లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.

47 But the Levites after the tribe of their fathers were not numbered among them.అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.

48 For Yahweh spoke to Moses, saying,ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెనునీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు.

49 "Only the tribe of Levi you shall not number, neither shall you take a census of them among the children of Israel;ఇశ్రాయేలీ యుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.

50 but appoint the Levites over the Tabernacle of the Testimony, and over all its furnishings, and over all that belongs to it. They shall carry the tabernacle, and all its furnishings; and they shall take care of it, and shall encamp around it.నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయు లను నియమింపుము. వారే మందిర మును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు.

51 When the tabernacle is to move, the Levites shall take it down; and when the tabernacle is to be set up, the Levites shall set it up. The stranger who comes near shall be put to death.మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.

52 The children of Israel shall pitch their tents, every man by his own camp, and every man by his own standard, according to their divisions.ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.

53 But the Levites shall encamp around the Tabernacle of the Testimony, that there may be no wrath on the congregation of the children of Israel: and the Levites shall be responsible for the Tabernacle of the Testimony."ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.

54 Thus the children of Israel did. According to all that Yahweh commanded Moses, so they did.యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీ యులు చేసిరి.

Telugu Bible