Proverbs 9 - YLT (Telugu)
1 Wisdom hath builded her house, She hath hewn out her pillars -- seven.జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కు కొనినది
2 She hath slaughtered her slaughter, She hath mingled her wine, Yea, she hath arranged her table.పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది
3 She hath sent forth her damsels, She crieth on the tops of the high places of the city:తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి
4 `Who `is' simple? let him turn aside hither.' Whoso lacketh heart: she hath said to him,జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించు చున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది
5 `Come, eat of my bread, And drink of the wine I have mingled.వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి
6 Forsake ye, the simple, and live, And be happy in the way of understanding.ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
7 The instructor of a scorner Is receiving for it -- shame, And a reprover of the wicked -- his blemish.అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
8 Reprove not a scorner, lest he hate thee, Give reproof to the wise, and he loveth thee.అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిం చును.
9 Give to the wise, and he is wiser still, Make known to the righteous, And he increaseth learning.జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
10 The commencement of wisdom `is' the fear of Jehovah, And a knowledge of the Holy Ones `is' understanding.యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.
11 For by me do thy days multiply, And added to thee are years of life.నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
12 If thou hast been wise, thou hast been wise for thyself, And thou hast scorned -- thyself bearest `it'.నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
13 A foolish woman `is' noisy, Simple, and hath not known what.బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.
14 And she hath sat at the opening of her house, On a throne -- the high places of the city,అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును.
15 To call to those passing by the way, Who are going straight `on' their paths.ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి
16 `Who `is' simple? let him turn aside hither.' And whoso lacketh heart -- she said to him,జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలు చును.
17 `Stolen waters are sweet, And hidden bread is pleasant.'అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగి లించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
18 And he hath not known that Rephaim `are' there, In deep places of Sheol her invited ones!అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నా రనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.
Telugu Bible