Psalm 73 - WEB (Telugu)
1 > Surely God is good to Israel, To those who are pure in heart.ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
2 But as for me, my feet were almost gone. My steps had nearly slipped.నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
3 For I was envious of the arrogant, When I saw the prosperity of the wicked.భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
4 For there are no struggles in their death, But their strength is firm.మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
5 They are free from burdens of men, Neither are they plagued like other men.ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
6 Therefore pride is like a chain around their neck. Violence covers them like a garment.కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
7 Their eyes bulge with fat. Their minds pass the limits of conceit.క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి
8 They scoff and speak with malice. In arrogance, they threaten oppression.ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
9 They have set their mouth in the heavens. Their tongue walks through the earth.ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.
10 Therefore their people return to them, And they drink up waters of abundance.వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
11 They say, "How does God know? Is there knowledge in the Most High?"దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
12 Behold, these are the wicked. Being always at ease, they increase in riches.ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
13 Surely in vain I have cleansed my heart, And washed my hands in innocence,నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
14 For all day long have I been plagued, And punished every morning.దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
15 If I had said, "I will speak thus;" Behold, I would have betrayed the generation of your children.ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
16 When I tried to understand this, It was too painful for me;అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
17 Until I entered God's sanctuary, And considered their latter end.నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
18 Surely you set them in slippery places. You throw them down to destruction.నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
19 How they are suddenly destroyed! They are completely swept away with terrors.క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
20 As a dream when one wakes up, So, Lord, when you awake, you will despise their fantasies.మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు.
21 For my soul was grieved. I was embittered in my heart.నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
22 I was so senseless and ignorant. I was a brute beast before you.నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
23 Nevertheless, I am continually with you. You have held my right hand.అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
24 You will guide me with your counsel, And afterward receive me to glory.నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
25 Who do I have in heaven? There is no one on earth who I desire besides you.ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు.
26 My flesh and my heart fails, But God is the strength of my heart and my portion forever.నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.
27 For, behold, those who are far from you shall perish. You have destroyed all those who are unfaithful to you.నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు.
28 But it is good for me to come close to God. I have made the Lord Yahweh my refuge, That I may tell of all your works.నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.
Telugu Bible