Bible

John 13 - WEB (Telugu)

1 Now before the feast of the Passover, Jesus knowing that his time had come that he would depart from this world to the Father, having loved his own who were in the world, he loved them to the end.తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.

2 After supper, the devil having already put into the heart of Judas Iscariot, Simon's son, to betray him,వారు భోజనము చేయు చుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది3 ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక

3 Jesus, knowing that the Father had given all things into his hands, and that he came forth from God, and was going to God,తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి

4 arose from supper, and laid aside his outer garments. He took a towel, and wrapped a towel around his waist.భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.

5 Then he poured water into the basin, and began to wash the disciples' feet, and to wipe them with the towel that was wrapped around him.అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.

6 Then he came to Simon Peter. He said to him, "Lord, do you wash my feet?"ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.

7 Jesus answered him, "You don't know what I am doing now, but you will understand later."అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా

8 Peter said to him, "You will never wash my feet!" Jesus answered him, "If I don't wash you, you have no part with me."పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.

9 Simon Peter said to him, "Lord, not my feet only, but also my hands and my head!"సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.

10 Jesus said to him, "Someone who has bathed only needs to have his feet washed, but is completely clean. You are clean, but not all of you."యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.

11 For he knew him who would betray him, therefore he said, "You are not all clean."తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుకమీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.

12 So when he had washed their feet, put his outer garment back on, and sat down again, he said to them, "Do you know what I have done to you?వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండినేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?

13 You call me, 'Teacher' and 'Lord.' You say so correctly, for so I am.బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.

14 If I then, the Lord and the Teacher, have washed your feet, you also ought to wash one another's feet.కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.

15 For I have given you an example, that you also should do as I have done to you.నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.

16 Most assuredly I tell you, a servant is not greater than his lord, neither one who is sent greater than he who sent him.దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

17 If you know these things, blessed are you if you do them.ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.

18 I don't speak concerning all of you. I know whom I have chosen. But that the Scripture may be fulfilled, 'He who eats bread with me has lifted up his heel against me.'మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్ప రచుకొనినవారిని ఎరుగుదును గానినాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.

19 From now on, I tell you before it happens, that when it happens, you may believe that I AM.జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.

20 Most assuredly I tell you, he who receives whomever I send, receives me; and he who receives me, receives him who sent me."నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

21 When Jesus had said this, he was troubled in spirit, and testified, "Most assuredly I tell you that one of you will betray me."యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడిమీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను

22 The disciples looked at one another, perplexed about whom he spoke.ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు చూచు కొనుచుండగా

23 One of his disciples, whom Jesus loved, was at the table, leaning against Jesus' breast.ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను

24 Simon Peter therefore beckoned to him, and said to him, "Tell us who it is of whom he speaks."గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.

25 He, leaning back, as he was, on Jesus' breast, asked him, "Lord, who is it?"అతడు యేసు రొమ్మున ఆనుకొనుచుప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.

26 Jesus therefore answered, "It is he to whom I will give this piece of bread when I have dipped it." So when he had dipped the piece of bread, he gave it to Judas, the son of Simon Iscariot.అందుకు యేసునేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;

27 After the piece of bread, then Satan entered into him. Then Jesus said to him, "What you do, do quickly."వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసునీవు చేయు చున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా

28 Now no man at the table knew why he said this to him.ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజన మునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.

29 For some thought, because Judas had the money box, that Jesus said to him, "Buy what things we need for the feast," or that he should give something to the poor.డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.

30 Therefore, having received that morsel, he went out immediately. It was night.వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.

31 When he had gone out, Jesus said, "Now the Son of Man has been glorified, and God has been glorified in him.వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెనుఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవు డును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.

32 If God has been glorified in him, God will also glorify him in himself, and he will glorify him immediately.దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.

33 Little children, I will be with you a little while longer. You will seek me, and as I said to the Jews, 'Where I am going, you can't come,' so now I tell you.పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.

34 A new commandment I give to you, that you love one another, just like I have loved you; that you also love one another.మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.

35 By this everyone will know that you are my disciples, if you have love for one another."మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

36 Simon Peter said to him, "Lord, where are you going?" Jesus answered, "Where I am going, you can't follow now, but you will follow afterwards."సీమోను పేతురుప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లు చున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరు వాత వచ్చెదవని అతనితో చెప్పెను.

37 Peter said to him, "Lord, why can't I follow you now? I will lay down my life for you."అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా

38 Jesus answered him, "Will you lay down your life for me? Most assuredly I tell you, the rooster won't crow until you have denied me three times.యేసునాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

Telugu Bible