Mark 3 - KJV (Telugu)
1 And he entered again into the synagogue; and there was a man there which had a withered hand.సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.
2 And they watched him, whether he would heal him on the sabbath day; that they might accuse him.అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి.
3 And he saith unto the man which had the withered hand, Stand forth.ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి
4 And he saith unto them, Is it lawful to do good on the sabbath days, or to do evil? to save life, or to kill? But they held their peace.వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.
5 And when he had looked round about on them with anger, being grieved for the hardness of their hearts, he saith unto the man, Stretch forth thine hand. And he stretched it out: and his hand was restored whole as the other.ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
6 And the Pharisees went forth, and straightway took counsel with the Herodians against him, how they might destroy him.పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
7 But Jesus withdrew himself with his disciples to the sea: and a great multitude from Galilee followed him, and from Judaea,యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,
8 And from Jerusalem, and from Idumaea, and from beyond Jordan; and they about Tyre and Sidon, a great multitude, when they had heard what great things he did, came unto him.మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.
9 And he spake to his disciples, that a small ship should wait on him because of the multitude, lest they should throng him.జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.
10 For he had healed many; insomuch that they pressed upon him for to touch him, as many as had plagues.ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి.
11 And unclean spirits, when they saw him, fell down before him, and cried, saying, Thou art the Son of God.అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడినీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.
12 And he straitly charged them that they should not make him known.తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
13 And he goeth up into a mountain, and calleth unto him whom he would: and they came unto him.ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి.
14 And he ordained twelve, that they should be with him, and that he might send them forth to preach,వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు
15 And to have power to heal sicknesses, and to cast out devils:అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను.
16 And Simon he surnamed Peter;వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను
17 And James the son of Zebedee, and John the brother of James; and he surnamed them Boanerges, which is, The sons of thunder:జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.
18 And Andrew, and Philip, and Bartholomew, and Matthew, and Thomas, and James the son of Alphaeus, and Thaddaeus, and Simon the Canaanite,అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
19 And Judas Iscariot, which also betrayed him: and they went into an house.ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు.
20 And the multitude cometh together again, so that they could not so much as eat bread.ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.
21 And when his friends heard of it, they went out to lay hold on him: for they said, He is beside himself.ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
22 And the scribes which came down from Jerusalem said, He hath Beelzebub, and by the prince of the devils casteth he out devils.యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జె బూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
23 And he called them unto him, and said unto them in parables, How can Satan cast out Satan?అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?
24 And if a kingdom be divided against itself, that kingdom cannot stand.ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు.
25 And if a house be divided against itself, that house cannot stand.ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు.
26 And if Satan rise up against himself, and be divided, he cannot stand, but hath an end.సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును.
27 No man can enter into a strong man's house, and spoil his goods, except he will first bind the strong man; and then he will spoil his house.ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును.
28 Verily I say unto you, All sins shall be forgiven unto the sons of men, and blasphemies wherewith soever they shall blaspheme:సమస్త పాపములును మను ష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని
29 But he that shall blaspheme against the Holy Ghost hath never forgiveness, but is in danger of eternal damnation.పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
30 Because they said, He hath an unclean spirit.ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.
31 There came then his brethren and his mother, and, standing without, sent unto him, calling him.ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.
32 And the multitude sat about him, and they said unto him, Behold, thy mother and thy brethren without seek for thee.వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా
33 And he answered them, saying, Who is my mother, or my brethren?ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని
34 And he looked round about on them which sat about him, and said, Behold my mother and my brethren!తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;
35 For whosoever shall do the will of God, the same is my brother, and my sister, and mother.దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.
Telugu Bible