Bible

Mark 3 - ASV (Telugu)

1 And he entered again into the synagogue; and there was a man there who had his hand withered.సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.

2 And they watched him, whether he would heal him on the sabbath day; that they might accuse him.అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి.

3 And he saith unto the man that had his hand withered, Stand forth.ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి

4 And he saith unto them, Is it lawful on the sabbath day to do good, or to do harm? to save a life, or to kill? But they held their peace.వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.

5 And when he had looked round about on them with anger, being grieved at the hardening of their heart, he saith unto the man, Stretch forth thy hand. And he stretched it forth; and his hand was restored.ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

6 And the Pharisees went out, and straightway with the Herodians took counsel against him, how they might destroy him.పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

7 And Jesus with his disciples withdrew to the sea: and a great multitude from Galilee followed; and from Judaea,యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,

8 and from Jerusalem, and from Idumaea, and beyond the Jordan, and about Tyre and Sidon, a great multitude, hearing what great things he did, came unto him.మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.

9 And he spake to his disciples, that a little boat should wait on him because of the crowd, lest they should throng him:జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.

10 for he had healed many; insomuch that as many as had plagues pressed upon him that they might touch him.ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి.

11 And the unclean spirits, whensoever they beheld him, fell down before him, and cried, saying, Thou art the Son of God.అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడినీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.

12 And he charged them much that they should not make him known.తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.

13 And he goeth up into the mountain, and calleth unto him whom he himself would; and they went unto him.ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి.

14 And he appointed twelve, that they might be with him, and that he might send them forth to preach,వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు

15 and to have authority to cast out demons:అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను.

16 and Simon he surnamed Peter;వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను

17 and James the `son' of Zebedee, and John the brother of James; and them he surnamed Boanerges, which is, Sons of thunder:జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.

18 and Andrew, and Philip, and Bartholomew, and Matthew, and Thomas, and James the `son' of Alphaeus, and Thaddaeus, and Simon the Cananaean,అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,

19 and Judas Iscariot, who also betrayed him. And he cometh into a house.ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు.

20 And the multitude cometh together again, so that they could not so much as eat bread.ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.

21 And when his friends heard it, they went out to lay hold on him: for they said, He is beside himself.ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

22 And the scribes that came down from Jerusalem said, He hath Beelzebub, and, By the prince of the demons casteth he out the demons.యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జె బూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

23 And he called them unto him, and said unto them in parables, How can Satan cast out Satan?అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?

24 And if a kingdom be divided against itself, that kingdom cannot stand.ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు.

25 And if a house be divided against itself, that house will not be able to stand.ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు.

26 And if Satan hath rise up against himself, and is divided, he cannot stand, but hath an end.సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును.

27 But no one can enter into the house of the strong `man', and spoil his goods, except he first bind the strong `man'; and then he will spoil his house.ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును.

28 Verily I say unto you, All their sins shall be forgiven unto the sons of men, and their blasphemies wherewith soever they shall blaspheme:సమస్త పాపములును మను ష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని

29 but whosoever shall blaspheme against the Holy Spirit hath never forgiveness, but is guilty of an eternal sin:పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

30 because they said, He hath an unclean spirit.ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.

31 And there come his mother and his brethren; and, standing without, they sent unto him, calling him.ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.

32 And a multitude was sitting about him; and they say unto him, Behold, thy mother and thy brethren without seek for thee.వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా

33 And he answereth them, and saith, Who is my mother and my brethren?ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని

34 And looking round on them that sat round about him, he saith, Behold, my mother and my brethren!తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;

35 For whosoever shall do the will of God, the same is my brother, and sister, and mother.దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.

Telugu Bible