Mark 14 - WEB (Telugu)
1 It was now two days before the feast of the Passover and the unleavened bread, and the chief priests and the scribes sought how they might sieze him by deception, and kill him.రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొను చుండిరి గాని
2 For they said, "Not during the feast, because there might be a riot of the people."ప్రజలలో అల్లరి కలుగు నేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.
3 While he was at Bethany, in the house of Simon the leper, as he sat at the table, a woman came having an alabaster jar of ointment of pure nard-- very costly. She broke the jar, and poured it over his head.ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.
4 But there were some who were indignant among themselves, saying, "Why has this ointment been wasted?అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల?
5 For this might have been sold for more than three hundred denarii,{300 denarii was about a years wages for an agricultural laborer.} and given to the poor." They grumbled against her.ఈ అత్తరు మున్నూరు దేనార ముల1 కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.
6 But Jesus said, "Leave her alone. Why do you trouble her? She has done a good work for me.అందుకు యేసు ఇట్లనెనుఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను.
7 For you always have the poor with you, and whenever you want to, you can do them good; but you will not always have me.బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను.
8 She has done what she could. She has anointed my body beforehand for the burying.ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.
9 Most assuredly I tell you, wherever this Gospel may be preached throughout the whole world, that which this woman has done will also be spoken of for a memorial of her."సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
10 Judas Iscariot, who was one of the twelve, went away to the chief priests, that he might deliver him to them.పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులచేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా
11 They, when they heard it, were glad, and promised to give him money. He sought how he might conveniently deliver him.వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
12 On the first day of unleavened bread, when they sacrificed the Passover, his disciples asked him, "Where do you want us to go and make ready that you may eat the Passover?"పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులునీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా,
13 He sent two of his disciples, and said to them, "Go into the city, and there you will meet a man carrying a pitcher of water. Follow him,ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;
14 and wherever he enters in, tell the master of the house, 'The Teacher says, "Where is the guest room, where I may eat the Passover with my disciples?"'వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచినేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి.
15 He will himself show you a large upper room furnished and ready. Make ready for us there."అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచు డని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.
16 His disciples went out, and came into the city, and found things as he had said to them, and they prepared the Passover.శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధ పరచిరి.
17 When it was evening he came with the twelve.సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.
18 As they sat and were eating, Jesus said, "Most assuredly I tell you, one of you will betray me -- he who eats with me."వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసుమీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా
19 They began to be sorrowful, and to ask him one by one, "Surely not I?" And another said, "Surely not I?"వారు దుఃఖపడినేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.
20 He answered them, "It is one of the twelve, he who dips with me in the dish.అందుకాయనపండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే.
21 For the Son of Man goes, even as it is written about him, but woe to that man by whom the Son of Man is betrayed! It would be better for that man if he had not been born."నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మను ష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.
22 As they were eating, Jesus took bread, and when he had blessed, he broke it, and gave to them, and said, "Take, eat. This is my body."వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను.
23 He took the cup, and when he had given thanks, he gave to them. They all drank of it.పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.
24 He said to them, "This is my blood of the new covenant, which is poured out for many.అప్పుడాయన ఇది నిబంధనవిషయమై2 అనేకుల కొరకు చిందింపబడు చున్న నా రక్తము.
25 Most assuredly I tell you, I will no more drink of the fruit of the vine, until that day when I drink it anew in the Kingdom of God."నేను దేవుని రాజ్యములో ద్రాక్షా రసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
26 When they had sung a hymn, they went out to the Mount of Olives.అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.
27 Jesus said to them, "All of you will be made to stumble because of me tonight, for it is written, 'I will strike the shepherd, and the sheep will be scattered.'అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱల కాపరిని కొట్టుదును; గొఱ్ఱలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా.
28 However, after I am raised up, I will go before you into Galilee."అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయ లోనికి వెళ్లెదననెను.
29 But Peter said to him, "Although all will be offended, yet I will not."అందుకు పేతురుఅందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
30 Jesus said to him, "Most assuredly I tell you, that you today, even this night, before the rooster crows twice, you will deny me three times."యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను.
31 But he spoke all the more, "If I must die with you, I will not deny you." They all said the same thing.అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.
32 They came to a place which was named Gethsemane. He said to his disciples, "Sit here, while I pray."వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన--నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి
33 He took with him Peter, James, and John, and began to be greatly troubled and distressed.పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరం భించెను
34 He said to them, "My soul is exceedingly sorrowful, even to death. Stay here, and watch."అప్పుడాయననా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి
35 He went forward a little, and fell on the ground, and prayed that, if it were possible, the hour might pass away from him.కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు
36 He said, "Abba, Father, all things are possible to you. Please remove this cup from me. However, not what I desire, but what you desire."నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.
37 He came and found them sleeping, and said to Peter, "Simon, are you sleeping? Couldn't you watch one hour?మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచిసీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా?
38 Watch and pray, that you may not enter into temptation. The spirit indeed is willing, but the flesh is weak."మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
39 Again he went away, and prayed, saying the same words.తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.
40 Again he returned, and found them sleeping, for their eyes were very heavy, and they didn't know what to answer him.ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు.
41 He came the third time, and said to them, "Sleep on now, and take your rest. It is enough. The hour has come. Behold, the Son of Man is betrayed into the hands of sinners.ఆయన మూడవ సారి వచ్చిమీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు;
42 Arise, let us be going. Behold, he who betrays me is at hand."లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను.
43 Immediately, while he was still speaking, Judas, one of the twelve, came--and with him a multitude with swords and clubs, from the chief priests, the scribes, and the elders.వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి.
44 Now he who betrayed him had given them a sign, saying, "Whoever I will kiss, that is he. Seize him, and lead him away safely."ఆయనను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టు కొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను.
45 When he had come, immediately he came to him, and said, "Rabbi! Rabbi!" and kissed him.వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయిబోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా
46 They laid their hands on him, and seized him.వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.
47 But a certain one of those who stood by drew his sword, and struck the servant of the high priest, and cut off his ear.దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
48 Jesus answered them, "Have you come out, as against a robber, with swords and clubs to seize me?అందుకు యేసుమీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?
49 I was daily with you in the temple teaching, and you didn't arrest me. But this is so that the Scriptures might be fulfilled."నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).
50 They all left him, and fled.అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
51 A certain young man followed him, having a linen cloth thrown around himself, over his naked body. The young men grabbed him,తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి.
52 but he left the linen cloth, and fled from them naked.అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను.
53 They led Jesus away to the high priest. All the chief priests, the elders, and the scribes came together with him.వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొని పోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అంద రును అతనితోకూడవచ్చిరి.
54 Peter had followed him from a distance, until he came into the court of the high priest. He was sitting with the officers, and warming himself in the light of the fire.పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను.
55 Now the chief priests and the whole council sought witnesses against Jesus to put him to death, and found none.ప్రధానయాజకులును మహాసభవారంద రును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు.
56 For many gave false testimony against him, and their testimony didn't agree with each other.అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు.
57 Some stood up, and gave false testimony against him, saying,అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దిన ములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని
58 "We heard him say, 'I will destroy this temple that is made with hands, and in three days I will build another made without hands.'"ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి
59 Even so, their testimony did not agree.గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు.
60 The high priest stood up in the midst, and asked Jesus, "Have you no answer? What is it which these testify against you?"ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచిఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను.
61 But he stayed quiet, and answered nothing. Again the high priest asked him, "Are you the Christ, the Son of the Blessed?"అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడుపరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా
62 Jesus said, "I AM. You will see the Son of Man sitting at the right hand of Power, and coming with the clouds of the sky."యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.
63 The high priest tore his clothes, and said, "What further need have we of witnesses?ప్రధానయాజకుడు తన వస్త్ర ములు చింపుకొనిమనకు ఇక సాక్షులతో పని యేమి?
64 You have heard the blasphemy! What do you think?" They all condemned him to be worthy of death.ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరుమరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి.
65 Some began to spit on him, and to cover his face, and to beat him with fists, and to tell him, "Prophesy!" The officers struck him with the palms of their hands.కొందరు ఆయనమీద ఉమి్మవేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచుప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.
66 As Peter was in the courtyard below, one of the maids of the high priest came,పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి
67 and seeing Peter warming himself, she looked at him, and said, "You were also with the Nazarene, Jesus!"పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.
68 But he denied it, saying, "I neither know, nor understand what you are saying." He went out on the porch, and the rooster crowed.అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
69 The maid saw him, and began again to tell those who stood by, "This is one of them."ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
70 But he again denied it. After a little while again those who stood by said to Peter, "You truly are one of them, for you are a Galilean, and your speech shows it."అతడు మరలనేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచినిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.
71 But he began to curse, and to swear, "I don't know this man of whom you speak!"అందుకతడుమీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టు బెట్టుకొనుటకును మొదలు పెట్టెను.
72 The rooster crowed the second time. Peter remembered the word, how that Jesus said to him, "Before the rooster crows twice, you will deny me three times." When he thought about that, he wept.వెంటనే రెండవమారు కోడికూసెను గనుకకోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.
Telugu Bible