Bible

Mark 11 - YLT (Telugu)

1 And when they come nigh to Jerusalem, to Bethphage, and Bethany, unto the mount of the Olives, he sendeth forth two of his disciples,వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చి నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి

2 and saith to them, `Go away to the village that is over-against you, and immediately, entering into it, ye shall find a colt tied, on which no one of men hath sat, having loosed it, bring `it':మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కన బడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి.

3 and if any one may say to you, Why do ye this? say ye that the lord hath need of it, and immediately he will send it hither.'ఎవడైననుమీరెందుకు ఈలాగు చేయు చున్నారని మిమ్ము నడిగిన యెడలఅది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికితోలి పంపునని చెప్పి వారిని పంపెను.

4 And they went away, and found the colt tied at the door without, by the two ways, and they loose it,వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,

5 and certain of those standing there said to them, `What do ye -- loosing the colt?'అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

6 and they said to them as Jesus commanded, and they suffered them.అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.

7 And they brought the colt unto Jesus, and did cast upon it their garments, and he sat upon it,వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను.

8 and many did spread their garments in the way, and others were cutting down branches from the trees, and were strewing in the way.అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.

9 And those going before and those following were crying out, saying, `Hosanna! blessed `is' he who is coming in the name of the Lord;మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును జయము1

10 blessed is the coming reign, in the name of the Lord, of our father David; Hosanna in the highest.'ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము1 అని కేకలు వేయుచుండిరి.

11 And Jesus entered into Jerusalem, and into the temple, and having looked round on all things, it being now evening, he went forth to Bethany with the twelve.ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాల మైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.

12 And on the morrow, they having come forth from Bethany, he hungered,మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని

13 and having seen a fig-tree afar off having leaves, he came, if perhaps he shall find anything in it, and having come to it, he found nothing except leaves, for it was not a time of figs,ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.

14 and Jesus answering said to it, `No more from thee -- to the age -- may any eat fruit;' and his disciples were hearing.అందుకాయనఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి.

15 And they come to Jerusalem, and Jesus having gone into the temple, began to cast forth those selling and buying in the temple, and the tables of the money-changers and the seats of those selling the doves, he overthrew,వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవా లయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి

16 and he did not suffer that any might bear a vessel through the temple,దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్య కుండెను.

17 and he was teaching, saying to them, `Hath it not been written -- My house a house of prayer shall be called for all the nations, and ye did make it a den of robbers?'మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.

18 And the scribes and the chief priests heard, and they were seeking how they shall destroy him, for they were afraid of him, because all the multitude was astonished at his teaching;శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.

19 and when evening came, he was going forth without the city.సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.

20 And in the morning, passing by, they saw the fig-tree having been dried up from the roots,ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.

21 and Peter having remembered saith to him, `Rabbi, lo, the fig-tree that thou didst curse is dried up.'అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనిబోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.

22 And Jesus answering saith to them, `Have faith of God;అందుకు యేసు వారితో ఇట్లనెనుమీరు దేవునియందు విశ్వాసముంచుడి.

23 for verily I say to you, that whoever may say to this mount, Be taken up, and be cast into the sea, and may not doubt in his heart, but may believe that the things that he saith do come to pass, it shall be to him whatever he may say.ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమి్మనయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24 Because of this I say to you, all whatever -- praying -- ye do ask, believe that ye receive, and it shall be to you.అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

25 `And whenever ye may stand praying, forgive, if ye have anything against any one, that your Father also who is in the heavens may forgive you your trespasses;మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.

26 and, if ye do not forgive, neither will your Father who is in the heavens forgive your trespasses.'అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.

27 And they come again to Jerusalem, and in the temple, as he is walking, there come unto him the chief priests, and the scribes, and the elders,వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి

28 and they say to him, `By what authority dost thou these things? and who gave thee this authority that these things thou mayest do?'నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.

29 And Jesus answering said to them, `I will question you -- I also -- one word; and answer me, and I will tell you by what authority I do these things;అందుకు యేసునేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.

30 the baptism of John -- from heaven was it? or from men? answer me.'యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.

31 And they were reasoning with themselves, saying, `If we may say, From heaven, he will say, Wherefore, then, did ye not believe him?అందుకు వారుమనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయనఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును;

32 But if we may say, From men,' -- they were fearing the people, for all were holding John that he was indeed a prophet;మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి

33 and answering they say to Jesus, `We have not known;' and Jesus answering saith to them, `Neither do I tell you by what authority I do these things.'గనుక ప్రజలకు భయపడిఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసుఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.

Telugu Bible