Luke 5 - DBY (Telugu)
1 And it came to pass, as the crowd pressed on him to hear the word of God, that he was standing by the lake of Gennesaret:1 జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
2 and he saw two ships standing by the lake, but the fishermen, having come down from them, were washing their nets.ఆ సరస్సుతీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
3 And getting into one of the ships, which was Simon's, he asked him to draw out a little from the land; and he sat down and taught the crowds out of the ship.ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
4 But when he ceased speaking, he said to Simon, Draw out into the deep [water] and let down your nets for a haul.ఆయన బోధించుట చాలించిన తరువాతనీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
5 And Simon answering said to him, Master, having laboured through the whole night we have taken nothing, but at thy word I will let down the net.సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.
6 And having done this, they enclosed a great multitude of fishes. And their net broke.వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
7 And they beckoned to their partners who were in the other ship to come and help them, and they came, and filled both the ships, so that they were sinking.వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
8 But Simon Peter, seeing it, fell at Jesus' knees, saying, Depart from me, for I am a sinful man, Lord.సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడిప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
9 For astonishment had laid hold on him, and on all those who were with him, at the haul of fishes which they had taken;ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి.
10 and in like manner also on James and John, sons of Zebedee, who were partners with Simon. And Jesus said to Simon, Fear not; henceforth thou shalt be catching men.ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసుభయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
11 And having run the ships on shore, leaving all they followed him.వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
12 And it came to pass as he was in one of the cities, that behold, there was a man full of leprosy, and seeing Jesus, falling upon his face, he besought him saying, Lord, if thou wilt, thou art able to cleanse me.ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడిప్రభువా, నీ కిష్ట మైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.
13 And stretching forth his hand he touched him, saying, I will; be thou cleansed: and immediately the leprosy departed from him.అప్పు డాయన చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను.
14 And he enjoined him to tell no one; but go, shew thyself to the priest, and offer for thy cleansing as Moses ordained, for a testimony to them.అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని
15 But the report concerning him was spread abroad still more, and great crowds came together to hear, and to be healed from their infirmities.అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చు చుండెను.
16 And *he* withdrew himself, and was about in the desert [places] and praying.ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను.
17 And it came to pass on one of the days, that *he* was teaching, and there were Pharisees and doctors of the law sitting by, who were come out of every village of Galilee and Judaea and [out of] Jerusalem; and [the] Lord's power was [there] to heal them.ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూష లేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.
18 And lo, men bringing upon a couch a man who was paralysed; and they sought to bring him in, and put [him] before him.ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసి కొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచు టకు ప్రయత్నము చేసిరి గాని
19 And not finding what way to bring him in, on account of the crowd, going up on the housetop they let him down through the tiles, with his little couch, into the midst before Jesus.జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.
20 And seeing their faith, he said, Man, thy sins are forgiven thee.ఆయన వారి విశ్వాసము చూచిమనుష్యుడా, నీ పాప ములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా,
21 And the scribes and the Pharisees began to reason [in their minds], saying, Who is this who speaks blasphemies? Who is able to forgive sins but God alone?శాస్త్రు లును పరిసయ్యులునుదేవదూషణ చేయుచున్న యిత డెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి.
22 But Jesus, knowing their reasonings, answering said to them, Why reason ye in your hearts?యేసు వారి ఆలోచన లెరిగిమీరు మీ హృదయములలో ఏమి ఆలో చించుచున్నారు?
23 which is easier, to say, Thy sins are forgiven thee; or to say, Rise up and walk?నీ పాపములు క్షమింపబడి యున్న వని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?
24 But that ye may know that the Son of man has power on earth to forgive sins, he said to the paralysed man, I say to thee, Arise, and take up thy little couch and go to thine house.అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచినీవు లేచి, నీ మంచమెత్తికొ
25 And immediately standing up before them, having taken up that whereon he was laid, he departed to his house, glorifying God.వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.
26 And astonishment seized all, and they glorified God, and were filled with fear, saying, We have seen strange things to-day.అందరును విస్మయమొందినేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.
27 And after these things he went forth and saw a tax-gatherer, Levi by name, sitting at the receipt of taxes, and said to him, Follow me.అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా
28 And having left all, rising up, he followed him.అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను.
29 And Levi made a great entertainment for him in his house, and there was a great crowd of tax-gatherers and others who were at table with them.ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి.
30 And their scribes and the Pharisees murmured at his disciples, saying, Why do ye eat and drink with tax-gatherers and sinners?పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచిసుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
31 And Jesus answering said to them, They that are in sound health have not need of a physician, but those that are ill.అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు.
32 I am not come to call righteous [persons], but sinful [ones] to repentance.మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
33 And they said to him, Why do the disciples of John fast often and make supplications, in like manner those also of the Pharisees, but thine eat and drink?వారాయనను చూచియోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరి సయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.
34 And he said to them, Can ye make the sons of the bridechamber fast when the bridegroom is with them?అందుకు యేసుపెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింప గలరా?
35 But days will come when also the bridegroom will have been taken away from them; then shall they fast in those days.పెండ్లికుమా రుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.
36 And he spoke also a parable to them: No one puts a piece of a new garment upon an old garment, otherwise he will both rend the new, and the piece which is from the new will not suit with the old.ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగాఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలి యదు.
37 And no one puts new wine into old skins, otherwise the new wine will burst the skins, and it will be poured out, and the skins will be destroyed;ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును.
38 but new wine is to be put into new skins, and both are preserved.అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయ వలెను.
39 And no one having drunk old wine [straightway] wishes for new, for he says, The old is better.పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.
Telugu Bible