Bible

Luke 21 - YLT (Telugu)

1 And having looked up, he saw those who did cast their gifts to the treasury -- rich men,కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.

2 and he saw also a certain poor widow casting there two mites,ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి

3 and he said, `Truly I say to you, that this poor widow did cast in more than all;ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.

4 for all these out of their superabundance did cast into the gifts to God, but this one out of her want, all the living that she had, did cast in.'వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.

5 And certain saying about the temple, that with goodly stones and devoted things it hath been adorned, he said,కొందరుఇది అందమైన రాళ్లతోను అర్పితముల తోను శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి, మాటలాడుచుండగా

6 `These things that ye behold -- days will come, in which there shall not be left a stone upon a stone, that shall not be thrown down.'ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండ కుండ అవి పడద్రోయబడు దినములు వచ్చు చున్నవని చెప్పెను.

7 And they questioned him, saying, `Teacher, when, then, shall these things be? and what `is' the sign when these things may be about to happen?'అప్పుడు వారుబోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా

8 And he said, `See -- ye may not be led astray, for many shall come in my name, saying -- I am `he', and the time hath come nigh; go not on then after them;ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.

9 and when ye may hear of wars and uprisings, be not terrified, for it behoveth these things to happen first, but the end `is' not immediately.'మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.

10 Then said he to them, `Nation shall rise against nation, and kingdom against kingdom,మరియు ఆయన వారితో ఇట్లనెనుజనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;

11 great shakings also in every place, and famines, and pestilences, there shall be; fearful things also, and great signs from heaven there shall be;అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.

12 and before all these, they shall lay on you their hands, and persecute, delivering up to synagogues and prisons, being brought before kings and governors for my name's sake;ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

13 and it shall become to you for a testimony.ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.

14 `Settle, then, to your hearts, not to meditate beforehand to reply,కాబట్టి మేమేమి సమాధా నము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.

15 for I will give to you a mouth and wisdom that all your opposers shall not be able to refute or resist.మీ విరోధు లందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.

16 `And ye shall be delivered up also by parents, and brothers, and kindred, and friends, and they shall put of you to death;తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;

17 and ye shall be hated by all because of my name --నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.

18 and a hair out of your head shall not perish;గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.

19 in your patience possess ye your souls.మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

20 `And when ye may see Jerusalem surrounded by encampments, then know that come nigh did her desolation;యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచు నప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.

21 then those in Judea, let them flee to the mountains; and those in her midst, let them depart out; and those in the countries, let them not come in to her;అప్పుడు యూదయలో ఉండువారు కొండ లకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.

22 because these are days of vengeance, to fulfil all things that have been written.లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.

23 `And wo to those with child, and to those giving suck, in those days; for there shall be great distress on the land, and wrath on this people;ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.

24 and they shall fall by the mouth of the sword, and shall be led captive to all the nations, and Jerusalem shall be trodden down by nations, till the times of nations be fulfilled.వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.

25 `And there shall be signs in sun, and moon, and stars, and on the land `is' distress of nations with perplexity, sea and billow roaring;మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.

26 men fainting at heart from fear, and expectation of the things coming on the world, for the powers of the heavens shall be shaken.ఆకాశమందలి శక్తులు కదిలింప బడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.

27 `And then they shall see the Son of Man, coming in a cloud, with power and much glory;అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.

28 and these things beginning to happen bend yourselves back, and lift up your heads, because your redemption doth draw nigh.'ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.

29 And he spake a simile to them: `See the fig-tree, and all the trees,మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.

30 when they may now cast forth, having seen, of yourselves ye know that now is the summer nigh;అవి చిగిరించుటచూచి వసంత కాలమప్పుడే సమీపమాయె నని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా?

31 so also ye, when ye may see these things happening, ye know that near is the reign of God;అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.

32 verily I say to you -- This generation may not pass away till all may have come to pass;అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

33 the heaven and the earth shall pass away, but my words may not pass away.ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు.

34 `And take heed to yourselves, lest your hearts may be weighed down with surfeiting, and drunkenness, and anxieties of life, and suddenly that day may come on you,మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

35 for as a snare it shall come on all those dwelling on the face of all the land,ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.

36 watch ye, then, in every season, praying that ye may be accounted worthy to escape all these things that are about to come to pass, and to stand before the Son of Man.'కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.

37 And he was during the days in the temple teaching, and during the nights, going forth, he was lodging at the mount called of Olives;ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.

38 and all the people were coming early unto him in the temple to hear him.ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.

Telugu Bible