Leviticus 20 - WEB (Telugu)
1 Yahweh spoke to Moses, saying,మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
2 "Moreover, you shall tell the children of Israel, 'Anyone of the children of Israel, or of the strangers who live as foreigners in Israel, who gives any of his seed to Molech; he shall surely be put to death. The people of the land shall stone him with stones.ఇశ్రా యేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతాన మును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్ష విధింప వలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.
3 I also will set my face against that person, and will cut him off from among his people because he has given of his seed to Molech, to defile my sanctuary, and to profane my holy name.ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజ లలోనుండి వాని కొట్టివేతును.
4 If the people of the land all hide their eyes from that person, when he gives of his seed to Molech, and don't put him to death;మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,
5 then I will set my face against that man, and against his family, and will cut him off, and all who play the prostitute after him, to play the prostitute with Molech, from among their people.చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.
6 "'The person that turns to those who are mediums, and to the wizards, to play the prostitute after them, I will even set my face against that person, and will cut him off from among his people.మరియు కర్ణపిశాచి గలవారితోను సోదె గాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువా డెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.
7 "'Sanctify yourselves therefore, and be holy; for I am Yahweh your God.కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహో వాను.
8 You shall keep my statutes, and do them. I am Yahweh who sanctifies you.మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింప వలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను
9 "'For everyone who curses his father or his mother shall surely be put to death: he has cursed his father or his mother; his blood shall be upon him.ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
10 "'The man who commits adultery with another man's wife, even he who commits adultery with his neighbor's wife, the adulterer and the adulteress shall surely be put to death.పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
11 The man who lies with his father's wife has uncovered his father's nakedness: both of them shall surely be put to death; their blood shall be upon them.తన తండ్రి భార్యతో శయ నించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమునుతీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
12 "'If a man lies with his daughter-in-law, both of them shall surely be put to death: they have committed a perversion; their blood shall be upon them.ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.
13 If a man lies with a male, as with a woman, both of them have committed an abomination: they shall surely be put to death; their blood shall be upon them.ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
14 "'If a man takes a wife and her mother, it is wickedness: they shall be burned with fire, both he and they; that there may be no wickedness among you.ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండ కుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.
15 "'If a man lies with an animal, he shall surely be put to death; and you shall kill the animal.జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.
16 "'If a woman approaches any animal, and lies down with it, you shall kill the woman, and the animal: they shall surely be put to death; their blood shall be upon them.స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.
17 "'If a man takes his sister, his father's daughter, or his mother's daughter, and sees her nakedness, and she sees his nakedness; it is a shameful thing; and they shall be cut off in the sight of the children of their people: he has uncovered his sister's nakedness; he shall bear his iniquity.ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.
18 "'If a man lies with a woman having her monthly period, and uncovers her nakedness; he has made naked her fountain, and she has uncovered the fountain of her blood: and both of them shall be cut off from among their people.కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదన మును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజ లలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
19 "'You shall not uncover the nakedness of your mother's sister, nor of your father's sister; for he has made naked his close relative: they shall bear their iniquity.నీ తల్లి సహో దరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా చ్ఛాదన మునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
20 If a man lies with his uncle's wife, he has uncovered his uncle's nakedness: they shall bear their sin; they shall die childless.పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.
21 "'If a man takes his brother's wife, it is an impurity: he has uncovered his brother's nakedness; they shall be childless.ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
22 "'You shall therefore keep all my statutes, and all my ordinances, and do them; that the land, where I am bringing you to dwell, may not vomit you out.కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను.
23 You shall not walk in the customs of the nation, which I am casting out before you: for they did all these things, and therefore I abhorred them.నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.
24 But I have said to you, "You shall inherit their land, and I will give it to you to possess it, a land flowing with milk and honey." I am Yahweh your God, who has separated you from the peoples.నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్య ముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవ హించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపర చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
25 "'You shall therefore make a distinction between the clean animal and the unclean, and between the unclean fowl and the clean: and you shall not make yourselves abominable by animal, or by bird, or by anything with which the ground teems, which I have separated from you as unclean for you.కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువల ననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.
26 You shall be holy to me: for I, Yahweh, am holy, and have set you apart from the peoples, that you should be mine.మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
27 "'A man or a woman that is a medium, or is a wizard, shall surely be put to death: they shall stone them with stones; their blood shall be upon them.'"పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.
Telugu Bible