Bible

Leviticus 13 - WBT (Telugu)

1 And the LORD spoke to Moses and Aaron, saying,మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

2 When a man shall have in the skin of his flesh a rising, a scab, or bright spot, and it be in the skin of his flesh like the plague of leprosy; then he shall be brought to Aaron the priest, or to one of his sons the priests:ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మ మందు కుష్ఠుపొడవంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజ కులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను.

3 And the priest shall look on the plague in the skin of the flesh: and when the hair in the plague is turned white, and the plague in sight is deeper than the skin of his flesh, it is a plague of leprosy: and the priest shall look on him, and pronounce him unclean.ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.

4 If the bright spot is white in the skin of his flesh, and in sight, not deeper than the skin, and the hair of it not turned white; then the priest shall shut up him that hath the plague seven days:నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.

5 And the priest shall look on him the seventh day: and behold, if the plague in his sight is at a stay, and the plague spreadeth not in the skin; then the priest shall shut him up seven days more:​ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.

6 And the priest shall look on him again the seventh day: and behold, if the plague is somewhat dark, and the plague spreadeth not in the skin, the priest shall pronounce him clean: it is but a scab: and he shall wash his clothes, and be clean.ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.

7 But if the scab shall spread much in the skin, after he hath been seen by the priest for his cleansing, he shall be seen by the priest again:అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.

8 And if the priest shall see, that behold, the scab spreadeth in the skin, then the priest shall pronounce him unclean: it is a leprosy.అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.

9 When the plague of leprosy is in a man, then he shall be brought to the priest:కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.

10 And the priest shall see him: and behold, if the rising is white in the skin, and it hath turned the hair white, and there is raw flesh in the rising;యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుక లను తెల్లబారినయెడలను, వాపులో పచ్చి మాంసము కన బడినయెడలను,

11 It is an old leprosy in the skin of his flesh, and the priest shall pronounce him unclean, and shall not shut him up; for he is unclean.అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అప విత్రుడు.

12 And if a leprosy shall break out in the skin, and the leprosy shall cover all the skin of him that hath the plague from his head even to his foot, wherever the priest looketh;కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలు కొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల

13 Then the priest shall consider: and behold, if the leprosy hath covered all his flesh, he shall pronounce him clean that hath the plague: it is all turned white: he is clean.యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు.

14 But when raw flesh appeareth in him, he shall be unclean.అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు.

15 And the priest shall see the raw flesh, and pronounce him to be unclean: for the raw flesh is unclean: it is a leprosy.యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.

16 Or if the raw flesh shall turn again, and be changed into white, he shall come to the priest;​అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకునియొద్దకు రావలెను;

17 And the priest shall see him: and behold, if the plague is turned into white: then the priest shall pronounce him clean that hath the plague: he is clean.యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు.

18 The flesh also, in which, even in the skin of it, was a boil, and is healed,ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత

19 And in the place of the boil there shall be a white rising, or a bright spot, white, and somewhat reddish, and it be showed to the priest;ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దానికనుపరచవలెను.

20 And if, when the priest seeth it, behold, it is in sight lower than the skin, and the hair of it is turned white; the priest shall pronounce him unclean: it is a plague of leprosy broken out of the boil.యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.

21 But if the priest shall look on it, and behold, there are no white hairs in it, and if it is not lower than the skin, but somewhat dark; then the priest shall shut him up seven days:యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.

22 And if it hath spread much in the skin, then the priest shall pronounce him unclean: it is a plague.అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.

23 But if the bright spot shall stay in its place, and not spread, it is a burning boil; and the priest shall pronounce him clean.నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.

24 Or if there is any flesh, in the skin of which there is a hot burning, and the live flesh that burneth hath a white bright spot, somewhat reddish or white;దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానే గాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.

25 Then the priest shall look upon it: and behold, if the hair in the bright spot is turned white, and it is in sight deeper than the skin: it is a leprosy broken out of the burning: wherefore the priest shall pronounce him unclean: it is the plague of leprosy.నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.

26 But if the priest shall look on it, and behold, there is no white hair in the bright spot, and it is no lower than the other skin, but is somewhat dark; then the priest shall shut him up seven days:యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.

27 And the priest shall look upon him the seventh day: and if it is spread much in the skin, then the priest shall pronounce him unclean: it is the plague of leprosy,ఏడవనాడు యాజ కుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.

28 And if the bright spot shall stay in its place, and not spread in the skin, but be somewhat dark; it is a rising of the burning, and the priest shall pronounce him clean: for it is an inflammation of the burning.అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.

29 If a man or woman shall have a plague upon the head or the beard;పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా

30 Then the priest shall see the plague: and behold, if it is in sight deeper than the skin, and there is in it a yellow thin hair; then the priest shall pronounce him unclean: it is a dry scall, even a leprosy upon the head or beard.అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన యెడల, వాడు అపవిత్రు డని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము.

31 And if the priest shall look on the plague of the scall, and behold, it is not in sight deeper than the skin, and no black hair in it; then the priest shall shut up him that hath the plague of the scall seven days:యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచి నప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేని యెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

32 And in the seventh day the priest shall look on the plague: and behold, if the scall spreadeth not, and there is in it no yellow hair, and the scall is not in sight deeper than the skin;ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,

33 He shall be shaven, but the scall shall he not shave; and the priest shall shut up him that hath the scall seven days more:వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

34 And in the seventh day the priest shall look on the scall: and behold, if the scall is not spread in the skin, nor is in sight deeper than the skin; then the priest shall pronounce him clean: and he shall wash his clothes, and be clean.ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.

35 But if the scall shall spread much in the skin after his cleansing;వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను,

36 Then the priest shall look on him: and behold, if the scall is spread in the skin, the priest shall not seek for yellow hair; he is unclean.అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.

37 But if the scall shall be in his sight at a stay, and there is black hair grown in it; the scall is healed, he is clean: and the priest shall pronounce him clean.అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజ కుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.

38 If a man also or a woman shall have in the skin of their flesh bright spots, even white bright spots;మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల

39 Then the priest shall look: and behold, if the bright spots in the skin of their flesh are darkish white; it is a freckled spot that groweth in the skin; he is clean.యాజకుడు వానిని చూడ వలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.

40 And the man whose hair hath fallen off his head, he is bald; yet is he clean.తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయి నను వాడు పవిత్రుడు.

41 And he that hath his hair fallen off from the part of his head towards his face, he is forehead-bald; yet is he clean.​ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు.

42 And if there is in the bald head, or bald forehead, a white reddish sore; it is a leprosy sprung up on his bald head, or his bald forehead.అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి యందైనను పుట్టిన కుష్ఠము.

43 Then the priest shall look upon it: and behold, if the rising of the sore is white reddish on his bald head, or on his bald forehead, as the leprosy appeareth in the skin of the flesh;యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మ మందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల

44 He is a leprous man, he is unclean: the priest shall pronounce him utterly unclean; his plague is in his head.వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.

45 And the leper in whom the plague is, his clothes shall be rent, and his head bare, and he shall put a covering upon his upper lip, and shall cry, Unclean, unclean.ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.

46 All the days in which the plague shall be in him he shall be defiled; he is unclean: he shall dwell alone, without the camp shall his habitation be.ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

47 The garment also that the plague of leprosy is in, whether a woolen garment, or a linen garment;మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి

48 Whether in the warp, or woof, of linen, or of woolen: whether in a skin, or in any thing made of skin:నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునం దేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి

49 And if the plague is greenish or reddish in the garment, or in the skin, either in the warp, or in the woof, or in any thing of skin: it is a plague of leprosy, and shall be shown to the priest:ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కను పరచవలెను.

50 And the priest shall look upon the plague, and shut up that which hath the plague seven days:యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

51 And he shall look on the plague on the seventh day: if the plague is spread in the garment, either in the warp, or in the woof, or in a skin, or in any work that is made of skin: the plague is a fretting leprosy; it is unclean.ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అప విత్రము.

52 He shall therefore burn that garment, whether warp or woof, in woolen or in linen, or any thing of skin, in which the plague is: for it is a fretting leprosy; it shall be burnt in the fire.​కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.

53 And if the priest shall look, and behold, the plague is not spread in the garment, either in the warp or in the woof, or in any thing of skin;​అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపిం పక పోయినయెడల

54 Then the priest shall command that they wash the thing in which the plague is, and he shall shut it up seven days more:​యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచ వలెను.

55 And the priest shall look on the plague after it is washed: and behold, if the plague hath not changed its color, and the plague hath not spread; it is unclean; thou shalt burn it in the fire; it is fret inward, whether it is bare within or without.ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.

56 And if the priest shall look, and behold, the plague is somewhat dark after the washing of it; then he shall rend it out of the garment, or out of the skin, or out of the warp, or out of the woof:యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.

57 And if it shall appear still in the garment, either in the warp, or in the woof, or in any thing of skin; it is a spreading plague: thou shalt burn that in which the plague is, with fire.అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరు కుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.

58 And the garment, either warp, or woof, or whatever thing of skin it is, which thou shalt wash, if the plague hath departed from them, then it shall be washed the second time, and shall be clean.ఏ వస్త్రమునేగాని పడు గునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉది కినతరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;

59 This is the law of the plague of leprosy in a garment of woolen or linen, either in the warp or woof, or any thing of skins, to pronounce it clean, or to pronounce it unclean.అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేక యందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.

Telugu Bible